AP Government: ఏపీలో వారికి గుడ్ న్యూస్... దరఖాస్తులు ప్రారంభం! పత్రాలు రెడీ చేసుకోండి... Bullet Train: బుల్లెట్ రైలు డీపీఆర్ రెడీ... హైదరాబాద్ టు ముంబై జస్ట్ 3 గంటలే! Vijay: విజయ్‌ ప్రభుత్వం ఆరు నెలలకు మించి ఉండదు.. డీఎంకే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు Andhra Paris: ఆంధ్ర ప్యారిస్ కు పూర్వ వైభవం... తెనాలి కాలువల సుందరీకరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్! Chandrababu: ఆక్వా రంగాన్ని కాపాడండి... కేంద్ర మంత్రి పీయుష్ గోయల్‌కు సీఎం చంద్రబాబు లేఖ! New Pensions: కూటమి రెండేళ్ల పాలన పూర్తి... కొత్త పెన్షన్ల కు ఆరోజే ముహూర్తం ఫిక్స్! Gummadi Sandhyarani: మహానాడు విజయవంతానికి పార్టీ శ్రేణులకు మంత్రి సంధ్యారాణి దిశానిర్దేశం! Kondapalli Srinivas: క్రెడిట్ చోరీకి కేరాఫ్ వైసీపీ.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు! Atchennaidu: నిమ్మాడలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు! జూన్ 12న కొత్త పింఛన్లు! Nara Lokesh: డీప్ టెక్, క్వాంటం రంగాలకు కేంద్రంగా అమరావతి.. నారా లోకేష్! AP Government: ఏపీలో వారికి గుడ్ న్యూస్... దరఖాస్తులు ప్రారంభం! పత్రాలు రెడీ చేసుకోండి... Bullet Train: బుల్లెట్ రైలు డీపీఆర్ రెడీ... హైదరాబాద్ టు ముంబై జస్ట్ 3 గంటలే! Vijay: విజయ్‌ ప్రభుత్వం ఆరు నెలలకు మించి ఉండదు.. డీఎంకే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు Andhra Paris: ఆంధ్ర ప్యారిస్ కు పూర్వ వైభవం... తెనాలి కాలువల సుందరీకరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్! Chandrababu: ఆక్వా రంగాన్ని కాపాడండి... కేంద్ర మంత్రి పీయుష్ గోయల్‌కు సీఎం చంద్రబాబు లేఖ! New Pensions: కూటమి రెండేళ్ల పాలన పూర్తి... కొత్త పెన్షన్ల కు ఆరోజే ముహూర్తం ఫిక్స్! Gummadi Sandhyarani: మహానాడు విజయవంతానికి పార్టీ శ్రేణులకు మంత్రి సంధ్యారాణి దిశానిర్దేశం! Kondapalli Srinivas: క్రెడిట్ చోరీకి కేరాఫ్ వైసీపీ.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు! Atchennaidu: నిమ్మాడలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు! జూన్ 12న కొత్త పింఛన్లు! Nara Lokesh: డీప్ టెక్, క్వాంటం రంగాలకు కేంద్రంగా అమరావతి.. నారా లోకేష్!

Vijay: విజయ్‌ ప్రభుత్వం ఆరు నెలలకు మించి ఉండదు.. డీఎంకే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే కూటమి ప్రభుత్వం ఆరు నెలలు కూడా అధికారంలో కొనసాగలేదని డీఎంకే సీనియర్ నేత, తిరుచెందూర్ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు.

Published : 2026-05-18 11:11:00
  • స్టాలిన్ త్వరలోనే సీఎం అవుతారని అనితా రాధాకృష్ణన్ ధీమా..
     
  • కొళత్తూర్ ఓటర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు..

Vijay: తమిళనాడు రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) కూటమి ప్రభుత్వం కనీసం ఆరు నెలలు కూడా అధికారంలో కొనసాగలేదని డీఎంకే సీనియర్ నేత, తిరుచెందూర్ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ అత్యంత త్వరలోనే మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ తమిళనాడులో జరిగిన ఒక పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న రాధాకృష్ణన్.. అధికార టీవీకే సీనియర్ నేత, విల్లివాక్కం ఎమ్మెల్యే ఆధవ్ అర్జునకు బహిరంగ సవాల్ విసిరారు. ప్రస్తుత విజయ్ ప్రభుత్వం మరో నాలుగు నెలలు మాత్రమే మనుగడ సాగిస్తుందని జోస్యం చెప్పిన ఆయన, ఆధవ్ అర్జునకు ధైర్యం ఉంటే తక్షణమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, తాను కూడా రాజీనామా చేసి ఇద్దరం తిరుచెందూర్‌లో తలపడదామని సవాల్ విసిరారు. తిరుచెందూర్ తమ అడ్డా అని, అక్కడ ఎవరినైనా ఓడించే సత్తా తమకుందని వ్యాఖ్యానించారు. గత 25 ఏళ్లుగా తిరుచెందూర్ స్థానం రాధాకృష్ణన్‌కు బలమైన కోటగా కొనసాగుతుండడం గమనార్హం.

ఈ సందర్భంగా కొళత్తూర్ నియోజకవర్గ స్థానంలో మాజీ డీఎంకే నేత, ప్రస్తుతం టీవీకే తరపున పోటీ చేసిన వీఎస్ బాబు చేతిలో అనూహ్యంగా ఓడిపోయిన ఎంకే స్టాలిన్‌ను రాధాకృష్ణన్‌ గట్టిగా వెనకేసుకొచ్చారు. కొళత్తూర్ నియోజకవర్గాన్ని స్టాలిన్ ఒక సింగపూర్‌లా మార్చారని కొనియాడుతూనే, అక్కడి ఓటర్లను ఉద్దేశించి ‘పనికిరానివారు’ అంటూ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తమ అగ్రనేత స్టాలిన్ తదుపరి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ఈసారి ఆయనను తిరుచ్చి నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తామని రాధాకృష్ణన్ స్పష్టం చేశారు.

తమిళనాడు రాజకీయ ప్రస్థానంలో దశాబ్దాల తర్వాత సాంప్రదాయ ద్రవిడ పార్టీల హవాకు బ్రేక్ పడి, సరికొత్త పార్టీ అధికారం చేపట్టడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకుగానూ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ఒంటరిగానే 108 సీట్లు సాధించి, మిత్రపక్షాలతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తద్వారా గత 62 ఏళ్లుగా తమిళనాడును మార్చి మార్చి పాలిస్తున్న డీఎంకే, ఏఐఏడీఎంకేల జోరుకు విజయ్ గట్టి బ్రేక్ వేశారు. ఈ సున్నితమైన రాజకీయ నేపథ్యంలో డీఎంకే సీనియర్ నేత అనితా రాధాకృష్ణన్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే, ప్రభుత్వం కూలిపోతుందంటూ ఆయన చేసిన ఈ ఘాటు విమర్శలపై ఇప్పటి వరకు టీవీకే శ్రేణులు లేదా ముఖ్యమంత్రి విజయ్ వర్గం అధికారికంగా స్పందించలేదు.

Spotlight

Read More →