LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Singapore: సింగపూర్‌లో మంత్రుల శిక్షణా కార్యక్రమం 5వ రోజు! సంక్షోభ నిర్వహణపై లోతైన అధ్యయనం!

Singapore: సింగపూర్‌లో కొనసాగుతున్న మంత్రుల శిక్షణా కార్యక్రమం ఐదవ రోజుకూ చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రుల బృందం సింగపూర్‌లో అమలవుతున్న సంక్షోభ నిర్వహణ వ్యవస్థపై ప్రత్యేకంగా అధ్యయనం చేసింది.

AndhraPravasi News Desk 1 min read
Singapore: సింగపూర్‌లో మంత్రుల శిక్షణా కార్యక్రమం 5వ రోజు! సంక్షోభ నిర్వహణపై లోతైన అధ్యయనం!

సింగపూర్‌లో 5 వ రోజు కొనసాగుతున్న మంత్రుల శిక్షణ కార్యక్రమం..

సింగపూర్ సంక్షోభ నిర్వహణ వ్యవస్థ గురించి మంత్రులు బృందం అధ్యయనం..

సింగపూర్: సింగపూర్‌లో కొనసాగుతున్న మంత్రుల శిక్షణా కార్యక్రమం ఐదవ రోజుకూ చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రుల బృందం సింగపూర్‌లో అమలవుతున్న సంక్షోభ నిర్వహణ వ్యవస్థపై (Crisis Management System) ప్రత్యేకంగా అధ్యయనం చేసింది.

సింగపూర్ యూనివర్శిటీ ఆఫ్ సోషల్ సైన్సెస్ (SUSS)కి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రజ్వానా, అక్కడి ‘హోల్-ఆఫ్-గవర్నమెంట్’ (Whole-of-Government) విధానం గురించి వివరించారు. విపత్తుల సమయంలో ప్రభుత్వంలోని అన్ని శాఖలు ఒకే దిశలో సమన్వయంతో పని చేస్తూ ఎలా సమస్యలను సమర్థంగా ఎదుర్కొంటాయో ఆమె వివరించారు.

ఈ శిక్షణలో సంక్షోభ సమయంలో నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలి, నైతిక నిర్ణయాల ప్రాధాన్యత ఏమిటి, భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను ముందుగానే ఊహించి ఎలా సిద్ధంగా ఉండాలి వంటి కీలక అంశాలపై మంత్రులు చర్చించారు. ఈ అంశాలు ప్రజల ప్రాణ భద్రతకు, సమర్థ పరిపాలనకు ఎంత ముఖ్యమో వివరంగా అవగాహన పొందారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, బి.సి. జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. సింగపూర్‌లో నేర్చుకుంటున్న ఆధునిక పరిపాలన విధానాలను రాష్ట్రంలో అమలు చేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ శిక్షణ కొనసాగుతోంది.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…