Chintamaneni Prabhakar: ఇది కదా ప్రజా నాయకత్వం.. వృద్ధుడిని సొంత కారులో ఇంటికి చేర్చిన చింతమనేని!
Chintamaneni Prabhakar: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు తన సమస్యను చెప్పుకోవడానికి వచ్చిన 75 ఏళ్ల వృద్ధుడిని తన సొంత కారులో ఎక్కించుకుని, అతని గ్రామానికి తీసుకెళ్లి ఇంటి వద్ద దింపిన ఘటన ఆయన మానవత్వాన్ని చాటిచెబుతోంది. ప్రజా సమస్యల పట్ల స్పందించడమే కాకుండా, సామాన్యుల …
Politics- 75 ఏళ్ల వృద్ధుడి పట్ల ఎమ్మెల్యే చింతమనేని అపార గౌరవం…
క్యాంపు ఆఫీస్ నుండి వృద్ధుడి ఇంటి వరకు…
వృద్ధుడి సమస్యను ఇంటి వద్దే పరిష్కరించిన చింతమనేని….
Chintamaneni Prabhakar: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన ప్రజల పట్ల ఉన్న మక్కువను మరోసారి నిరూపించుకున్నారు. శుక్రవారం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారం (గ్రీవెన్స్) నిర్వహిస్తుండగా, పెదవేగి మండలం వంగూరు గ్రామానికి చెందిన 75 ఏళ్ల వృద్ధుడు మెరుగు సుదర్శన రావు తన సమస్యను విన్నవించుకోవడానికి వచ్చారు. ఆ ముసలాయన పరిస్థితిని చూసిన ఎమ్మెల్యే, ఎంతో ఆప్యాయంగా పలకరించి, ఎండలో ఎందుకు అంత దూరం వచ్చావని ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు. సమస్యను విన్న వెంటనే దానికి పరిష్కారం చూపుతానని భరోసా ఇచ్చారు.
ఆ వృద్ధుడు తిరిగి వెళ్లేందుకు ఆటో కోసం నడిచి వెళ్లాలని చెప్పడంతో చింతమనేని మనసు చలించింది. తన అధికారిక కారును పిలిపించి, స్వయంగా ఆ వృద్ధుడితో కలిసి కారు ఎక్కి అతని స్వగ్రామమైన వంగూరుకు తీసుకెళ్లారు. నేరుగా అతని ఇంటి వద్దే దింపి, అక్కడ ఉన్న సమస్యలను స్వయంగా పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి కూడా, ఒక సామాన్య వృద్ధుడి కోసం కారు దిగి ఇంటి వరకు తోడు వెళ్లడం చింతమనేని గారి ఉదారతకు నిదర్శనం. ఈ ఘటనతో సదరు వృద్ధుడు భావోద్వేగానికి గురై ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
Be the first to react