LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Chandrababu: జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రుల భేటీ.. పవన్ ఆరోగ్యంతో పాటు రాష్ట్ర పరిస్థితులపై చంద్రబాబు చర్చ.!

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామర్శించారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం చంద్రబాబు జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి…

AndhraPravasi News Desk 1 min read
Chandrababu: జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రుల భేటీ.. పవన్ ఆరోగ్యంతో పాటు రాష్ట్ర పరిస్థితులపై చంద్రబాబు చర్చ.!
  • హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన చంద్రబాబు..
     
  • Politics: తన నివాసానికి వచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన పవన్..

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో పర్యటించి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను పరామర్శించారు. ఇటీవల ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకుని జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పవన్‌ను కలిసేందుకు సీఎం స్వయంగా విచ్చేశారు. ముఖ్యమంత్రికి పవన్ కల్యాణ్ దంపతులు సాదర స్వాగతం పలకగా, ఈ సందర్భంగా చంద్రబాబు ఆయన ఆరోగ్య పరిస్థితిని సుదీర్ఘంగా అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ అనంతర పరిణామాలు, కోలుకుంటున్న తీరుపై ఆరా తీసిన సీఎం, ఆరోగ్యం పూర్తిగా కుదుటపడే వరకు వైద్యుల సూచనల మేరకు తగిన విశ్రాంతి తీసుకోవాలని, హడావిడిగా పనుల్లో నిమగ్నం కావొద్దని పవన్‌కు ఆత్మీయంగా సూచించారు.

ఈ పరామర్శ అనంతరం ఇరువురు నేతలు కొద్దిసేపు ఏకాంతంగా సమావేశమై రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు మరియు పాలనాపరమైన అంశాలపై క్లుప్తంగా చర్చించినట్లు సమాచారం. తన ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి, తీరిక లేని షెడ్యూల్‌లోనూ తన నివాసానికి వచ్చి పరామర్శించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పవన్ కల్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వాములుగా ఉన్న వీరిద్దరి భేటీ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ కల్యాణ్ త్వరగా కోలుకుని తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని అభిమానులు, కూటమి శ్రేణులు ఆకాంక్షిస్తున్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…