MLA Sirisha: కులానికి కాదు.. రాష్ట్ర భవిష్యత్తుకు రాజధాని.. అమరావతిపై విషప్రచారాన్ని ఖండించిన శిరీష.! Middle East War: గల్ఫ్ యుద్ధ పరిస్థితులపై చంద్రబాబు ముందు చూపు! చీఫ్ సెక్రటరీ తో పాటు 12 మంది వివిధ శాఖాధిపతుల తో కమిటీ ఏర్పాటు! Konatala Ramakrishna: రాజధాని శ్మశానం కాదు.. రైతుల త్యాగాల పురిటిగడ్డ.. వైసీపీ వ్యాఖ్యలపై కొణతాల ఆగ్రహం.! Daggubati Purandeswari: తక్కువ ఛార్జీలతో.. రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.. స్పెషల్ ట్రైన్ ఇక శాశ్వత సర్వీసు! Narayana: రాజధానిపై గత పాలకుల కుట్రలను బట్టబయలు చేసిన మంత్రి.. వైసీపీ విషప్రచారానికి కాలం చెల్లింది.. Nara Lokesh: అసెంబ్లీలో అమరావతిపై చారిత్రాత్మక చర్చ: జగన్ మాత్రం బెంగళూరు పారిపోయారు! లోకేశ్ హాట్ కామెంట్స్.. Amaravati Capital: జగన్ నిర్ణయాలను ఎండగట్టిన షర్మిల.. అమరావతి తీర్మానం ప్రభుత్వ విజన్‌కు నిదర్శనం! Amaravathi: ఇక మార్పుల్లేవు.. అమరావతికి చట్టబద్ధతే లక్ష్యం- సీఎం చంద్రబాబు! Middle East Conflict: భారత్ దెబ్బకు అమెరికా మైండ్ బ్లాక్.. అర్జెంటీనాతో మోదీ 'మాస్టర్ ప్లాన్'! Praja Vedika: నేడు (28/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! MLA Sirisha: కులానికి కాదు.. రాష్ట్ర భవిష్యత్తుకు రాజధాని.. అమరావతిపై విషప్రచారాన్ని ఖండించిన శిరీష.! Middle East War: గల్ఫ్ యుద్ధ పరిస్థితులపై చంద్రబాబు ముందు చూపు! చీఫ్ సెక్రటరీ తో పాటు 12 మంది వివిధ శాఖాధిపతుల తో కమిటీ ఏర్పాటు! Konatala Ramakrishna: రాజధాని శ్మశానం కాదు.. రైతుల త్యాగాల పురిటిగడ్డ.. వైసీపీ వ్యాఖ్యలపై కొణతాల ఆగ్రహం.! Daggubati Purandeswari: తక్కువ ఛార్జీలతో.. రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.. స్పెషల్ ట్రైన్ ఇక శాశ్వత సర్వీసు! Narayana: రాజధానిపై గత పాలకుల కుట్రలను బట్టబయలు చేసిన మంత్రి.. వైసీపీ విషప్రచారానికి కాలం చెల్లింది.. Nara Lokesh: అసెంబ్లీలో అమరావతిపై చారిత్రాత్మక చర్చ: జగన్ మాత్రం బెంగళూరు పారిపోయారు! లోకేశ్ హాట్ కామెంట్స్.. Amaravati Capital: జగన్ నిర్ణయాలను ఎండగట్టిన షర్మిల.. అమరావతి తీర్మానం ప్రభుత్వ విజన్‌కు నిదర్శనం! Amaravathi: ఇక మార్పుల్లేవు.. అమరావతికి చట్టబద్ధతే లక్ష్యం- సీఎం చంద్రబాబు! Middle East Conflict: భారత్ దెబ్బకు అమెరికా మైండ్ బ్లాక్.. అర్జెంటీనాతో మోదీ 'మాస్టర్ ప్లాన్'! Praja Vedika: నేడు (28/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Konatala Ramakrishna: రాజధాని శ్మశానం కాదు.. రైతుల త్యాగాల పురిటిగడ్డ.. వైసీపీ వ్యాఖ్యలపై కొణతాల ఆగ్రహం.!

Konatala Ramakrishna: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాజధాని అమరావతిపై జరుగుతున్న చర్చా వేదికగా జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో ఏపీ రాజధాని పరిస్థితిని ఒక 'వైకుంఠపాళి' ఆటలా మార్చేశారని, అభివృద్ధి ఏ దశలో ఉన్నా మళ్లీ మొదటికే వచ్చేలా కుట్రలు పన్నారని ఆయన విమర్శించారు.

Published : 2026-03-28 14:50:00
  • Politics: 20 మాసాల్లోనే అభివృద్ధిని గాడిలో పెట్టిన చంద్రబాబు: కొణతాల రామకృష్ణ ప్రశంసలు..
     
  • "జగన్ మాటలన్నీ అభూతకల్పనలే": క్షేత్రస్థాయి వాస్తవాలను వివరించిన కొణతాల..

Konatala Ramakrishna: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాజధాని అమరావతిపై జరుగుతున్న చర్చా వేదికగా జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో ఏపీ రాజధాని పరిస్థితిని ఒక 'వైకుంఠపాళి' ఆటలా మార్చేశారని, అభివృద్ధి ఏ దశలో ఉన్నా మళ్లీ మొదటికే వచ్చేలా కుట్రలు పన్నారని ఆయన విమర్శించారు. వైసీపీ నేతలు రాజధాని ప్రాంతాన్ని 'శ్మశాన వాటిక'గా అభివర్ణించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఇది ప్రజాస్వామ్యమే తలదించుకునేలా చేసిన చర్య అని మండిపడ్డారు. అమరావతి కోసం తమ విలువైన భూములను త్యాగం చేసిన రైతుల కృషి వెలకట్టలేనిదని, అటువంటి పవిత్ర ప్రాంతాన్ని కించపరిచేలా మాట్లాడటం దుర్మార్గమని ఆయన ధ్వజమెత్తారు. గత పాలకులు తమ స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని కొణతాల ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అనుభవజ్ఞుడైన నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం ఆవశ్యకతను కొణతాల రామకృష్ణ గుర్తు చేశారు. కేవలం 20 మాసాల అతి తక్కువ కాలంలోనే చంద్రబాబు రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి గాడిలో పెట్టారని కొనియాడారు. ఉత్తరాంధ్ర పారిశ్రామికాభివృద్ధిపై స్పందిస్తూ, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుంటూనే, నక్కపల్లిలో మరో భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న చొరవను ఆయన ప్రశంసించారు. ఒకవైపు ఉన్న పరిశ్రమలను రక్షించుకుంటూనే, కొత్త పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్న తీరు అభినందనీయమని పేర్కొన్నారు. అభివృద్ధికి ఆటంకం కలిగించే ధోరణిని వీడి, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు సహకరించాలని సూచించారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఖరిని విమర్శిస్తూ, అన్నీ తానే చేశానంటూ ఆయన అభూతకల్పనలు మాట్లాడుతున్నారని కొణతాల రామకృష్ణ ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరుగా ఉంటే, అసత్య ప్రచారాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజధాని నిర్మాణం ఆగిపోవడానికి, రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడటానికి ప్రధాన కారణం గత ప్రభుత్వ నిర్ణయాలేనని స్పష్టం చేశారు. ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి, రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. అమరావతి నిర్మాణం మరియు ఉత్తరాంధ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి తీరుతామని ఆయన పునరుద్ఘాటించారు.

Spotlight

Read More →