LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

West Bengal: పశ్చిమబెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు వేగం.. సీఎం ఎంపికపై ఉత్కంఠ!

West Bengal: పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నేడు బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుండగా, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకోనున్నారు. ఈ సమావేశంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కీలక ముందడుగు పడనుంది.

AndhraPravasi News Desk 1 min read
West Bengal: పశ్చిమబెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు వేగం.. సీఎం ఎంపికపై ఉత్కంఠ!

నేడు పశ్చిమబెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం..

ఎమ్మెల్యేలు - బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై నేడు కోల్‍కతా వెళ్లనున్న అమిత్‍షా..

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నేడు బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుండగా, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకోనున్నారు. ఈ సమావేశంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కీలక ముందడుగు పడనుంది.

ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోల్‌కతాకు వెళ్లనున్నారు. అక్కడ కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. ఇదే సమయంలో గవర్నర్ ఇప్పటికే పశ్చిమబెంగాల్ అసెంబ్లీని రద్దు చేయడం గమనార్హం.

రేపటికి కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో సీఎం పదవిపై ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా సువెందు అధికారి సహా ఐదుగురు నేతలు సీఎం రేసులో ఉన్నారని సమాచారం. అయితే పార్టీ అధినాయకత్వం ఎవరిని ఎంపిక చేస్తుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

ఇక రేపు కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులు, అలాగే ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. పశ్చిమబెంగాల్ రాజకీయాలు క్షణక్షణం మారుతున్న వేళ, కొత్త సీఎం ఎవరనే అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…