LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

CBN Birthday Celebrations: చంద్రబాబు జన్మదిన వేడుకలకు ముస్తాబవుతున్న ఆత్మకూరు!

CBN Birthday Celebrations: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరులో భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక హోమాలు, ప్రత్యేక సెట్టింగ్‌లతో ఈ వేడుకలను పండుగలా నిర్వహించేందుకు ఎన్డీఏ కూటమి శ్రేణులు సిద్…

AndhraPravasi News Desk 1 min read
CBN Birthday Celebrations: చంద్రబాబు జన్మదిన వేడుకలకు ముస్తాబవుతున్న ఆత్మకూరు!

Politics- 76వ ఏట అడుగుపెడుతున్న బాబు.. ఆత్మకూరులో పండుగ వాతావరణం.

రాజగోపురం సెట్, ప్రత్యేక హోమాలు.. సీఎం జన్మదినానికి ఆత్మకూరు ముస్తాబు!

చంద్రబాబు నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష.. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.

CBN Birthday Celebrations: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 20న ఆత్మకూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా వేడుకలు నిర్వహించనున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. నెల్లూరుపాళెం - ఆత్మకూరు రోడ్డులోని ఏఎంసీ (AMC) మైదానంలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక రాజగోపురం సెట్, హోమగుండాలు మరియు ఇతర ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విభజిత ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న దార్శనికుడు చంద్రబాబు అని కొనియాడారు. ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నిలబడిన ధీరోదాత్తుడు ఆయనని అభివర్ణించారు.

ముఖ్యమంత్రి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రానికి సుపరిపాలన అందించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ వేద పండితులతో ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలను ఒక పండుగలా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులన్నీ సమాయత్తం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. బూత్ కమిటీల నుండి మండల కమిటీల వరకు ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొని, గ్రామ గ్రామాన ప్రజలను ఈ వేడుకలకు ఆహ్వానించాలని దిశానిర్దేశం చేశారు.

ఇదే సందర్భంలో మంత్రి ఆనం కీలక రాజకీయ పరిణామాలను ప్రస్తావించారు. అమరావతిని శాశ్వత రాజధానిగా నిలబెట్టిన ఘనత చంద్రబాబుదేనని ఆయన స్పష్టం చేశారు. అలాగే, మహిళా బిల్లు చట్టరూపం దాల్చబోతోందని, ఇందుకోసం యువనేత నారా లోకేష్ ఢిల్లీలో ఎన్డీఏ కూటమి తరఫున ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఎన్టీఆర్ హయాంలో మహిళలకు ఆస్తి హక్కు కల్పిస్తే, ఇప్పుడు మహిళా బిల్లు అమలులో టీడీపీ ప్రధాన పాత్ర పోషించడం గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి నేతలందరూ ఈ విజయోత్సాహంతో జన్మదిన వేడుకల్లో పాల్గొనాలని కోరారు.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…