LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

AP Sea Shore Highway: తీరం వెంట రయ్‌.. రయ్‌! 120 కిలోమీటర్ల 'సీ షోర్ హైవే' ప్రతిపాదనకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్.!

AP New Sea Shore Highway: ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ముఖచిత్రాన్ని మార్చే విధంగా నరసాపురం నుంచి మచిలీపట్నం మీదుగా బాపట్ల వరకు 120 కిలోమీటర్ల పొడవున సరికొత్త ‘సముద్ర తీర రహదారి’ (సీ షోర్‌ హైవే) నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.

AndhraPravasi News Desk 2 min read
AP Sea Shore Highway: తీరం వెంట రయ్‌.. రయ్‌! 120 కిలోమీటర్ల 'సీ షోర్ హైవే' ప్రతిపాదనకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్.!
  • Politics: పర్యాటకానికి కొత్త మలుపు: హంసలదీవి, సూర్యలంక బీచ్‌లకు ఇక హైవే హంగులు..
     
  • "గోవా బీచ్‌లను తలపించేలా ఏపీ తీరం": సీ షోర్ హైవేతో పర్యాటక రంగానికి మహర్దశ..

Bapatla AP New Sea Shore Highway: ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ముఖచిత్రాన్ని మార్చే విధంగా నరసాపురం నుంచి మచిలీపట్నం మీదుగా బాపట్ల వరకు 120 కిలోమీటర్ల పొడవున సరికొత్త ‘సముద్ర తీర రహదారి’ (సీ షోర్‌ హైవే) నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎన్‌హెచ్‌-216 (కత్తిపూడి-ఒంగోలు) విస్తరణకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. సాధారణంగా జాతీయ రహదారి విస్తరణ చేపట్టాలంటే భారీగా భూసేకరణ చేయాల్సి ఉంటుంది, దీనివల్ల వేల కోట్ల రూపాయల పరిహారం చెల్లించడమే కాకుండా అనేక భవనాలు, గ్రామాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ సమస్యలను అధిగమించేందుకు సముద్ర తీరం వెంబడి కొత్త రహదారిని నిర్మిస్తే భూసేకరణ భారం తప్పుతుందని, తక్కువ ఖర్చుతో వేగంగా పనులు పూర్తి చేయవచ్చని మంత్రి కొల్లు రవీంద్ర ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సానుకూలత వ్యక్తం కావడంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఒప్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఈ సీ షోర్‌ హైవే నిర్మాణం వల్ల కేవలం రవాణా సౌకర్యాలే కాకుండా బందరు పోర్టు, నిజాంపట్నం పోర్టుల మధ్య అనుసంధానత పెరిగి సరుకు రవాణాకు ఎంతో వెసులుబాటు కలుగుతుంది. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలను కలిపే ఈ రహదారి పర్యాటక రంగానికి మణిమకుటంగా మారనుంది. ప్రస్తుతం సరైన దారి లేక పర్యాటకులకు దూరంగా ఉన్న పెద్దగొల్లపాలెం, పెదపట్నం, హంసలదీవి వంటి అద్భుతమైన బీచ్‌లకు ఈ హైవే ద్వారా మహర్దశ పట్టనుంది. గోవా తీరాలను తలపించే ఈ ప్రాంతాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఉంది. తీర ప్రాంతంలో సముద్రంలో కలిసే కాల్వల వద్ద ఫ్లైఓవర్లు లేదా ఆర్‌వోబీలు నిర్మించడం ద్వారా ప్రయాణం మరింత సులభతరం అవుతుందని ఈ ప్రణాళికలో పొందుపరిచారు.

ఆర్థిక ప్రయోజనాలతో పాటు పర్యావరణ రక్షణలోనూ ఈ హైవే కీలక పాత్ర పోషించనుంది. మచిలీపట్నం తీర ప్రాంతంలో సముద్రపు కోతను నివారించేందుకు ఈ రహదారి ఒక రక్షణ కవచంలా (బండ్‌) పనిచేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా కృత్తివెన్ను మండలంలోని తీర గ్రామాలు సముద్రపు కోతకు గురికాకుండా ఈ నిర్మాణం అడ్డుకుంటుంది. కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్ (సీఆర్ జడ్) నిబంధనల ప్రకారం రహదారుల నిర్మాణానికి ఆటంకాలు ఉండవని, కాబట్టి కేంద్రం నుంచి అనుమతులు సులభంగానే వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం పారిశ్రామికంగా, పర్యాటక పరంగా దేశంలోనే ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…