Chandrababu: ప్రపంచ స్థాయి పరికరాల ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. సచివాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం.. Minister Gottipati: గ్రామాల్లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుపై మంత్రి కీలక ఆదేశం.. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా.. Assam Elections 2026: అస్సాం బీజేపీ మేనిఫెస్టో విడుదల: మహిళలకు నెలకు రూ.3,000 సాయం! Minister Nimmala: కర్నూలు పశ్చిమ ప్రాంతానికి మాస్టర్ ప్లాన్.. చంద్రబాబు ప్రత్యేక దృష్టి.. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలోనే.! AP Development: అమరావతిపై జగన్ వైఖరి మార్చుకోవాలి.. డ్యామ్ సైట్ నుంచి సీఎంకు ఫోన్ చేసిన పయ్యావుల! Minister Narayana: 40 ఏళ్ల నాటి సమస్యకు నెల రోజుల్లోనే పరిష్కారం.. ఇంటింటికీ వెళ్లి.. పేద విద్యార్థులకు అంతర్జాతీయ విద్య! Chandrababu Tour: నెల్లూరు, కడప జిల్లాల్లో చంద్రబాబు పర్యటన! రేపు పింఛన్ల పంపిణీలో - రాత్రికి ఒంటిమిట్టలోనే.! Nara Lokesh: మునగాలపాడులో విషాదం.. నేనున్నాను.. అర్జున్ సోదరి కోమలి భవిష్యత్తుకు లోకేష్ హామీ.! Chandrababu: సంజీవని ప్రాజెక్టుపై సమీక్షలో అధికారులతో చంద్రబాబు.. 5 పిల్లర్లతో పటిష్టంగా - ఏడాదిలో 56.40 లక్షల మందికి.! Amaravati: అమరావతికి పార్లమెంటు పట్టాభిషేకం... చట్టబద్ధమైన రాజధానిగా కేంద్రం ముద్ర! Chandrababu: ప్రపంచ స్థాయి పరికరాల ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. సచివాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం.. Minister Gottipati: గ్రామాల్లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుపై మంత్రి కీలక ఆదేశం.. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా.. Assam Elections 2026: అస్సాం బీజేపీ మేనిఫెస్టో విడుదల: మహిళలకు నెలకు రూ.3,000 సాయం! Minister Nimmala: కర్నూలు పశ్చిమ ప్రాంతానికి మాస్టర్ ప్లాన్.. చంద్రబాబు ప్రత్యేక దృష్టి.. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలోనే.! AP Development: అమరావతిపై జగన్ వైఖరి మార్చుకోవాలి.. డ్యామ్ సైట్ నుంచి సీఎంకు ఫోన్ చేసిన పయ్యావుల! Minister Narayana: 40 ఏళ్ల నాటి సమస్యకు నెల రోజుల్లోనే పరిష్కారం.. ఇంటింటికీ వెళ్లి.. పేద విద్యార్థులకు అంతర్జాతీయ విద్య! Chandrababu Tour: నెల్లూరు, కడప జిల్లాల్లో చంద్రబాబు పర్యటన! రేపు పింఛన్ల పంపిణీలో - రాత్రికి ఒంటిమిట్టలోనే.! Nara Lokesh: మునగాలపాడులో విషాదం.. నేనున్నాను.. అర్జున్ సోదరి కోమలి భవిష్యత్తుకు లోకేష్ హామీ.! Chandrababu: సంజీవని ప్రాజెక్టుపై సమీక్షలో అధికారులతో చంద్రబాబు.. 5 పిల్లర్లతో పటిష్టంగా - ఏడాదిలో 56.40 లక్షల మందికి.! Amaravati: అమరావతికి పార్లమెంటు పట్టాభిషేకం... చట్టబద్ధమైన రాజధానిగా కేంద్రం ముద్ర!

Minister Narayana: 40 ఏళ్ల నాటి సమస్యకు నెల రోజుల్లోనే పరిష్కారం.. ఇంటింటికీ వెళ్లి.. పేద విద్యార్థులకు అంతర్జాతీయ విద్య!

Minister Narayana: నగర అభివృద్ధిపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా నగరంలో మంగళవారం సుడిగాలి పర్యటన నిర్వహించారు . పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా పొర్లుకట్ట ప్రాంతంలో 1.2 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను స్వయంగా పరిశీలించారు .40 ఏళ్ల నాటి స్థానికుల సమస్యకు నెల రోజుల్లోనే పరిష్కారం చూపుతామన్నారు.

Published : 2026-03-31 15:49:00
  • జూన్ 12 కల్లా కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు పూర్తి…
     
  • Politics: లోకేష్ విజన్‌తో టిడ్కో ప్రాంగణంలో హైటెక్ పాఠశాల…

Minister Narayana: నగర అభివృద్ధిపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రత్యేక దృష్టి సారించారు. అందులో  భాగంగా నగరంలో మంగళవారం సుడిగాలి పర్యటన నిర్వహించారు . పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా పొర్లుకట్ట ప్రాంతంలో 1.2 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను స్వయంగా పరిశీలించారు .40 ఏళ్ల నాటి స్థానికుల సమస్యకు నెల రోజుల్లోనే పరిష్కారం చూపుతామన్నారు. నాణ్యతలో రాజీ పడకుండా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతీ వీధిలో పర్యటించి ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.​ అనంతరం ఆత్మకూరు బస్టాండ్ వద్ద 28 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసారు. ఇచ్చిన మాట ప్రకారం నిర్ణీత కాలంలోనే రోడ్డు పూర్తి చేస్తామన్నారు. జేమ్స్ గార్డెన్‌లో ఎన్టీఆర్ సుజల 30వ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. భవిష్యత్తులో నగరవ్యాప్తంగా 120 ప్లాంట్లు ఏర్పాటు చేసి, రోజుకు 6 లక్షల లీటర్ల మినరల్ వాటర్‌ను కేవలం 2 రూపాయలకే 20 లీటర్ల చొప్పున అందజేస్తామని ప్రకటించారు. అనంతరం 53 ,54 వ డివిజన్ లలోని ప్రభుత్వ పాఠశాలలతో పాటు టిడ్కో సముదాయంలో వైఎస్సార్సీపీ నిర్వీర్యం చేసిన పాఠశాల భవనాలను  పరిశీలించారు. వెంకటేశ్వరపురం సచివాలయంలో అధికారులు,సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలుపై దిశానిర్దేశం చేశారు.సచివాలయానికి వచ్చే దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అంకితభావంతో పనిచేయాలని సూచించారు .అనంతరం  మంత్రి మీడియాతో మాట్లాడుతూ మాది పేదల పక్షపాత ప్రభుత్వమని తెలిపారు. ప్రతీ పేదవాడికీ కూడు, గూడు, నీడ కల్పించాలన్నదే సీఎం చంద్రబాబు సంకల్పమన్నారు. పేదరిక నిర్మూలనకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని, గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన 5 వేల టిడ్కో ఇళ్లను పునరుద్ధరించడమే కాకుండా, యువనేత లోకేష్ విజన్‌కు అనుగుణంగా ఆ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి పాఠశాలను నిర్మించి పేద విద్యార్థులకు అత్యున్నత విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు.జూన్ 12 కల్లా నగరంలో కోట్లాది రూపాయలతో చేపట్టిన అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసి, నెల్లూరును ఒక సుందర నగరంగా తీర్చిదిద్ది రాష్ట్రానికే రోల్ మోడల్‌గా నిలబెడతాననన్నారు.

ఈ కార్యక్రమంలో కమీషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పెర్సన్ తాళ్ళపాక అనూరాధ, టీడీపీ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కపిర రేవతి, టీడీపీ నేతలు ధర్మవరం సుబ్బారావు,పెంచల బాబు, పోకల రవి, సుజన్, జహీర్, జమీర్, జంషీద్, సుధాకర్ రెడ్డి, కార్పొరేషన్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

Spotlight

Read More →