Highway: 110 కి.మీ దూరం తగ్గనున్న బెంగళూరు–విజయవాడ మార్గం! AP Government: దేశంలోనే తొలిసారి ఏపీలోనే... 125 కేంద్రాల ద్వారా ఆటిజం బాధితులకు ఉచిత థెరపీ! Nara Lokesh: కృష్ణా నది ఘాట్‌... ఎక్కడా దేవాన్ష్ పేరు ఉండకూడదు.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు! Mahanadu: న్యూజిలాండ్‌లో పసుపు పండుగ... ఘనంగా ఎన్నారై టీడీపీ మహానాడు వేడుకలు! Mumbai: ముంబయిలో తెలుగు భవనం ఏర్పాటుకు కృషి చేస్తాం.. మంత్రి కందుల దుర్గేష్ ప్రకటన! Nara Lokesh: శ్రీసిటీలో రైళ్ల ప్లాంట్‌ స్థాపించండి- నారా లోకేష్!! Highcourt: అమరావతిలో పలు సంస్థలకు అదనపు భూమి... రూ. 547 కోట్లు మంజూరు చేసిన ఏపీ సర్కార్! Visakhapatnam: వైజాగ్‌ టు భోగాపురం 'బేసిటీ'.. సాగరతీరంలో చంద్రబాబు సరికొత్త సరిహద్దులు! Rajya Sabha: టీడీపీ రాజ్యసభ రేసులో వీళ్లే ముందంజ... ఇద్దరి పేర్లు ఖరారు, మూడో స్థానం కోసం ఆ ఇద్దరి పేర్లు! Nara Lokesh: ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన! Highway: 110 కి.మీ దూరం తగ్గనున్న బెంగళూరు–విజయవాడ మార్గం! AP Government: దేశంలోనే తొలిసారి ఏపీలోనే... 125 కేంద్రాల ద్వారా ఆటిజం బాధితులకు ఉచిత థెరపీ! Nara Lokesh: కృష్ణా నది ఘాట్‌... ఎక్కడా దేవాన్ష్ పేరు ఉండకూడదు.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు! Mahanadu: న్యూజిలాండ్‌లో పసుపు పండుగ... ఘనంగా ఎన్నారై టీడీపీ మహానాడు వేడుకలు! Mumbai: ముంబయిలో తెలుగు భవనం ఏర్పాటుకు కృషి చేస్తాం.. మంత్రి కందుల దుర్గేష్ ప్రకటన! Nara Lokesh: శ్రీసిటీలో రైళ్ల ప్లాంట్‌ స్థాపించండి- నారా లోకేష్!! Highcourt: అమరావతిలో పలు సంస్థలకు అదనపు భూమి... రూ. 547 కోట్లు మంజూరు చేసిన ఏపీ సర్కార్! Visakhapatnam: వైజాగ్‌ టు భోగాపురం 'బేసిటీ'.. సాగరతీరంలో చంద్రబాబు సరికొత్త సరిహద్దులు! Rajya Sabha: టీడీపీ రాజ్యసభ రేసులో వీళ్లే ముందంజ... ఇద్దరి పేర్లు ఖరారు, మూడో స్థానం కోసం ఆ ఇద్దరి పేర్లు! Nara Lokesh: ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన!

మాదల గంగులు ఎదుర్కొన్న హృదయవిదారక సంఘటన తీవ్రంగా కలచివేసింది : నారా లోకేష్

అమరావతి: విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని చిట్టెంపాడుకు చెందిన మాదల గంగులు ఎదుర్కొన్న హృదయవిదారక సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని తెదేపా జాతీయ కార్యదర్శి అ

Published : 2024-01-17 15:12:00

అమరావతి: విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని చిట్టెంపాడుకు చెందిన మాదల గంగులు ఎదుర్కొన్న హృదయవిదారక సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని తెదేపా జాతీయ కార్యదర్శి అన్నారు. రాష్ట్రంలో అంపశయ్యపైకి చేరిన వైద్య, ఆరోగ్య పరిస్థితులకు, గిరిజనుల కష్టాలను ఇది కళ్లకు కడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

అసమర్థుడి పాలనలో గిరిజన బిడ్డలకు సరైన వైద్యం అందించడం ఎలాగూ చేతకాలేదని, కనీసం మృతదేహాన్ని తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేయలేరా? అని ప్రశ్నించారు. ఫోన్ కొట్టిన వెంటనే 'కుయ్.. కుయ్..' అంటూ అంబులెన్స్ పరుగెత్తుకొస్తుందని గాలికబుర్లు చెప్పే ముఖ్యమంత్రి దీనికి ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.

గ్రామానికి చెందిన మాదల గంగులుకు భార్య, ఆరు నెలల కుమారుడు ఉన్నారు. ఈనెల 5న కుమారుడికి అనారోగ్యం చేయడంతో డోలీలో శృంగవరపుకోట ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అప్పటికే భార్య గంగమ్మ కూడా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతోంది. ఇద్దరినీ విజయనగరం సర్వజన ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్ కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బాబు ఈ నెల 6వ తేదీన మృతి చెందాడు.

సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here

తర్వాత గంగమ్మ (23) కూడా తీవ్ర అనారోగ్యం పాలవడంతో మూడు రోజుల క్రితం విశాఖ జిల్లా భీమిలి సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా.. మంగళవారం మధ్యాహ్నం చికిత్స పొందుతూ చనిపోయింది.

గంగులు తన భార్య మృతదేహాన్ని ఆటోలో తీసుకురావడానికి మాట్లాడారు. డ్రైవరు ఎస్.కోట వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి రానంటూ వెనక్కి వెళ్లిపోయాడు. విధిలేక బాధను దిగమింగుకుంటూ తన స్నేహితుల ద్విచక్ర వాహనం తీసుకొని తమ్ముడు సాయంతో భార్య మృతదేహాన్ని మధ్యలో కూర్చోబెట్టుకొని ఏడు కిలోమీటర్లు దూరంలో ఉన్న బొడ్డవర రైల్వేస్టేషను వరకు తీసుకువెళ్లాడు. అక్కడి నుంచి రహదారి సౌకర్యం లేకపోవడంతో డోలీ కట్టి బంధువుల సాయంతో మోసుకుంటూ గ్రామానికి తరలించాడు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →