Highway: 110 కి.మీ దూరం తగ్గనున్న బెంగళూరు–విజయవాడ మార్గం! AP Government: దేశంలోనే తొలిసారి ఏపీలోనే... 125 కేంద్రాల ద్వారా ఆటిజం బాధితులకు ఉచిత థెరపీ! Nara Lokesh: కృష్ణా నది ఘాట్‌... ఎక్కడా దేవాన్ష్ పేరు ఉండకూడదు.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు! Mahanadu: న్యూజిలాండ్‌లో పసుపు పండుగ... ఘనంగా ఎన్నారై టీడీపీ మహానాడు వేడుకలు! Mumbai: ముంబయిలో తెలుగు భవనం ఏర్పాటుకు కృషి చేస్తాం.. మంత్రి కందుల దుర్గేష్ ప్రకటన! Nara Lokesh: శ్రీసిటీలో రైళ్ల ప్లాంట్‌ స్థాపించండి- నారా లోకేష్!! Highcourt: అమరావతిలో పలు సంస్థలకు అదనపు భూమి... రూ. 547 కోట్లు మంజూరు చేసిన ఏపీ సర్కార్! Visakhapatnam: వైజాగ్‌ టు భోగాపురం 'బేసిటీ'.. సాగరతీరంలో చంద్రబాబు సరికొత్త సరిహద్దులు! Rajya Sabha: టీడీపీ రాజ్యసభ రేసులో వీళ్లే ముందంజ... ఇద్దరి పేర్లు ఖరారు, మూడో స్థానం కోసం ఆ ఇద్దరి పేర్లు! Nara Lokesh: ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన! Highway: 110 కి.మీ దూరం తగ్గనున్న బెంగళూరు–విజయవాడ మార్గం! AP Government: దేశంలోనే తొలిసారి ఏపీలోనే... 125 కేంద్రాల ద్వారా ఆటిజం బాధితులకు ఉచిత థెరపీ! Nara Lokesh: కృష్ణా నది ఘాట్‌... ఎక్కడా దేవాన్ష్ పేరు ఉండకూడదు.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు! Mahanadu: న్యూజిలాండ్‌లో పసుపు పండుగ... ఘనంగా ఎన్నారై టీడీపీ మహానాడు వేడుకలు! Mumbai: ముంబయిలో తెలుగు భవనం ఏర్పాటుకు కృషి చేస్తాం.. మంత్రి కందుల దుర్గేష్ ప్రకటన! Nara Lokesh: శ్రీసిటీలో రైళ్ల ప్లాంట్‌ స్థాపించండి- నారా లోకేష్!! Highcourt: అమరావతిలో పలు సంస్థలకు అదనపు భూమి... రూ. 547 కోట్లు మంజూరు చేసిన ఏపీ సర్కార్! Visakhapatnam: వైజాగ్‌ టు భోగాపురం 'బేసిటీ'.. సాగరతీరంలో చంద్రబాబు సరికొత్త సరిహద్దులు! Rajya Sabha: టీడీపీ రాజ్యసభ రేసులో వీళ్లే ముందంజ... ఇద్దరి పేర్లు ఖరారు, మూడో స్థానం కోసం ఆ ఇద్దరి పేర్లు! Nara Lokesh: ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన!

యువత భవిష్యత్‌కు నాదీ గ్యారెంటీ... "రా.. కదలిరా’ రాతియుగం కావాలా? స్వర్ణయుగం కావాలా?: చంద్రబాబు

14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశా కానీ ఇలాంటి పాలన చేయలేదు.. !! తెలుగుజాతి అభివృద్ధి కోసము... వైసీపీని తరిమేసేందుకు ‘రా.. కదలిరా’ జగన్‌ పాలనలో రాష్

Published : 2024-01-10 05:46:00

14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశా కానీ ఇలాంటి పాలన చేయలేదు.. !!

తెలుగుజాతి అభివృద్ధి కోసము... వైసీపీని తరిమేసేందుకు ‘రా.. కదలిరా’

జగన్‌ పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులపాలవుతున్నారని, రాక్షసులకు అధికారం ఇవ్వడం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్‌ పాలన రాతియుగాన్ని గుర్తుకు తెస్తోందని ధ్వజమెత్తారు. వైసీపీ రాతియుగం పోయి స్వర్ణయుగం రావాలంటే టీడీపీ-జనసేన పాలన రావాలని.. రాష్ట్ర భవిష్యత్‌ బాగుండాలంటే ప్రజలంతా మూకుమ్మడిగా వైసీపీని తరిమేయాలని ప్రజలకు పిలుపిచ్చారు. ‘రా.. కదలిరా!’ పేరుతో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంగళవారం మధ్యాహ్నం చంద్రబాబు భారీ బహిరంగ సభ నిర్వహించారు. సైకో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేస్తున్నాడని.. రద్దులు, గుద్దులు, నొక్కుడు, బొక్కుడు, కూల్చివేతలు, దాడులు, అక్రమ కేసులు తప్ప ఏమీ చేతకాదన్నారు. ప్రజావేదిక కూల్చడంతో విధ్వంస పాలనకు శ్రీకారం చుట్టాడని, దీనికి చరమగీతం పాడాలంటే వైసీపీని ఇంటికి సాగనంపాలని చె ప్పారు.

‘జగనన్న వదిలిన బాణం అంటూ షర్మిల ఉమ్మడి రాష్ట్రమంతా తిరిగింది. జగన్‌ సీఎం కావాలం టూ ప్రచారం చేసింది. ఇపుడేమైంది.. ఆస్తి అడిగిందని ఇంట్లో నుంచి తరిమేశాడు. అది చెప్పకుండా ప్రతిపక్షాలు తమ ఇంట్లో చిచ్చు పెట్టడానికి చూస్తున్నాయని డ్రామాలు మొదలుపెట్టాడు. మీ ఇంట్లో గొడవలకు ఇతరుల మీద పడి ఏడవడం ఏమిటో అర్థం కాదు..’ అని విమర్శించారు. వివేకాను చంపి తనపై నిందలు వేశాడని జగన్‌పై విరుచుకుపడ్డారు. ‘పైగా నారాసుర రక్తచరిత్ర అంటూ అబద్ధపు రాతలు రాయించారు. అసల నిందితులను కాపాడుతూ.. దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపై కేసులు పెట్టించారు. వివేకా కుమార్తె సునీతనూ కేసులతో వేధిస్తున్నారు. రేపో మాపో సొంత చెల్లెలు షర్మిలపై కేసు పెట్టినా ఆశ్యర్యం లేదు’ అని వ్యాఖ్యానించారు.

ఈ సైకో జగన్‌... తండ్రి మరణాన్ని కూడా రాజకీయానికి వాడుకున్నాడు. తన తండ్రిని కుట్ర చేసి రిలయన్స్‌ వారే చంపించారంటూ రెచ్చగొట్టి రిలయన్స్‌ షాపులను ధ్వంసం చేయించారు. ఆ తర్వాత వారికి సంబంధించిన వ్యక్తికి రాజ్యసభ టికెట్‌ ఇచ్చారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధించడం అలవాటైపోయింది. డ్రైవర్‌ను చంపి డోర్‌ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఊరేగింపుగా తీసుకొచ్చారు. వైసీపీ నాయకుల వేధింపులకు తట్టుకోలేక అబ్దుల్‌ సలాం కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడేలా చేశారు. ఇలా లెక్క కు మించి దారుణాలు చేస్తూ రాష్ట్రంలో రాతియుగం నాటి రోజులను గుర్తు చేస్తున్నారు. అధికారం నాకు కొత్త కాదు. 40 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతు న్నా.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశా. కానీ జగన్‌ లాంటి పాలనను ఎప్పుడూ చేయలేదు. నా తపనంతా తెలుగుజాతి అభివృద్ధి కోసమే. వైసీపీని తరిమేసేందుకు ‘రా.. కదలిరా’ అంటూ సభలు నిర్వహిస్తున్నాను.

కమీషన్ల కక్కుర్తితో పెట్టుబడులను తరిమేశాడు. ఈ ప్రభుత్వ వేధింపులు భరించలేక అమర్‌రాజా, జాకీ కంపెనీలు పారిపోయాయి. నేను రాష్ట్రానికి కీయా, కార్బన్‌, డిక్సన్‌, అపోలోటైర్స్‌ వంటి కంపెనీలు తెచ్చా. 2019లో టీడీపీ గెలిచి ఉంటే కడప స్టీల్‌ ఫ్యాక్టరీ పూర్తయ్యేది. జగన్‌ ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు. స్టీల్‌ ఫ్యాక్టరీకి రిబ్బన్‌ కట్‌ చేసి గాలికొదిలేశాడు. యువత భవిష్యత్‌కు నాదీ గ్యారెంటీ. రాయలసీమకు నీళ్లు తెచ్చి, మౌలిక సదుపాయాలు కల్పించి, యువతకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తే రతనాల సీమగా మారుతుంది. జగన్‌ సీమకు చెందినవాడైనా ఈ ప్రాంతానికి తీర ని అన్యాయం చేశాడు. ప్రాజెక్టులను నాశనం చేశాడు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

అలగనూరు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు రిపేరు చేయలేని దద్దమ్మ ఈ ప్రభుత్వం. రాయలసీమకు టీడీపీ 10 లక్షల ఎకరాలకు డ్రిప్‌ ఇరిగేషన్‌ అందిస్తే, వైసీపీ ప్రభుత్వం 6 లక్షల ఎకరాలకు కుదించింది. టీడీపీ హయాంలో పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని తరలించి శ్రీశైలంలో 120 టీఎంసీలను ఆదా చేశాం. ముచ్చుమర్రి, సిద్ధాపురం, కులకుర్తి, గోరుకల్లు, పులికనుమ, అవుకు టన్నెల్‌ను పూర్తి చేశాం. నల్లమలలో ఒక టన్నెల్‌ ఏర్పాటు చేసి గోదావరి నీటిని బానకచర్ల రిజర్వాయర్‌కు ఆలోచన చేశాను. కానీ తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వస్తే పట్టిసీమ, నల్లమల టన్నెల్‌ ద్వారా సీమకు 350 టీఎంసీల నీటిని తీసుకొస్తాం. సీమను ఉద్యానవనశాఖ హబ్‌గా మారుస్తాం. జగన్‌ రాష్ట్రాన్ని దోచుకుంటుంటే, నంద్యాల ఎమ్మెల్యేలు జిల్లాను దోచుకుంటున్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బ్రిజేంద్రారెడ్డి అన్నం బదులు ఇసుక, ఎర్రమట్టి, రేషన్‌ బియ్యం బొక్కుతున్నారు. సండే ఎమ్మెల్యేగా పేరుబడిన నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి నేషనల్‌ హైవేను అష్టవంకర్లు తిప్పి తన భూ ములకు రేట్లు పెంచుకున్నాడు. ఇక పిట్టకథల మంత్రి బుగ్గన పాత సినిమాల్లో నాగభూషణంలా మాట్లాడుతూ.. చేయాల్సిందంతా చేస్తున్నాడు. నందికొట్కూ రు, కోడుమూరు ఎమ్మెల్యేలు ఆర్థర్‌, సుధాకర్‌ దళితు లు కాబట్టి వారిని బలిపశువులను చేశారు.

అంగన్వాడీల జీతాలు పెంచమంటే ఎస్మా ప్రయోగించి ఉద్యోగాలు తొలగిస్తానని జగన్‌ బెదిరిస్తున్నాడు. టీడీపీ అధికారంలోకి వస్తే వారికి న్యాయం చేస్తాం. జగన్‌ బటన్‌ నొక్కి రూ.10 పంచుతూ రూ.100 నొక్కేస్తున్నాడు. టీడీపీ వస్తే రూ.15 పంచుతూ రూ.100 సంపాదించేందుకు చేయూతనిస్తా. భూముల పాసు పుస్తకాలపై జగన్‌ ఫొటో పెట్టుకోవాలని చూస్తున్నాడు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →