LIVE
Chandrababu: ప్రజల నమ్మకం పెంచేందుకు జూలై నుంచి అధికారుల క్షేత్ర పర్యటనలు తప్పనిసరి.. సీఎం చంద్రబాబు ఆదేశాలు!  •  Chandrababu: ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేలా పంటల సాగు విధానాలు రూపొందించాలి.. సీఎం చంద్రబాబు సూచనలు!  •  Yoga: సంజీవనితో యోగాను అనుసంధానం చేసి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలి.. సీఎం చంద్రబాబు!  •  Kollu Ravindra: ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. మంత్రి కొల్లు రవీంద్ర!  •  Gottipati Ravi: వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాం.. మార్కాపురాన్ని హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతాం.. మంత్రి గొట్టిపాటి రవికుమార్!  •  Kollu Ravindra: కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం.. మంత్రి కొల్లు రవీంద్ర!  •  Nimmala Ramanaidu: రెండేళ్ల కూటమి పాలనకు ప్రజల బ్రహ్మరథం.. మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు!  •  President: రేపటి నుంచి మధ్యప్రదేశ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు రోజుల పర్యటన!  •  Amarnath: అమర్‌నాథ్ యాత్రకు భారీ భద్రతా ఏర్పాట్లు.. 63 మంది అధికారుల నియామకం!  •  Jal Jeevan Mission: జల్ జీవన్ మిషన్ 2.0 అమలుకు కేంద్రంతో జమ్మూ-కాశ్మీర్ ఒప్పందం!  • 
Politics

AP liquor scam: రూ.441.63 కోట్ల.. మద్యం మాఫియా గుట్టురట్టు.. ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ బిగ్ షాక్!

AP liquor scam: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితులుగా ఉన్న కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, ఇతర నిందితులకు చెందిన రూ.441.63 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు శ…

AndhraPravasi News Desk 1 min read
AP liquor scam: రూ.441.63 కోట్ల.. మద్యం మాఫియా గుట్టురట్టు.. ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ బిగ్ షాక్!
  • దర్యాప్తు ఇంకా ముగియలేదు: లిక్కర్ స్కామ్ మూలాలు వెతికే పనిలో ఈడీ.. మరిన్ని అటాచ్‌మెంట్లకు అవకాశం?
     
  • కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి టార్గెట్‌గా ఈడీ అటాచ్‌మెంట్: రంగంలోకి మనీ లాండరింగ్ చట్టం..

AP liquor scam: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితులుగా ఉన్న కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, ఇతర నిందితులకు చెందిన రూ.441.63 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు శుక్రవారం ఈడీ అధికారికంగా ప్రకటించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈ ఆస్తులను జప్తు చేశారు. ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. జప్తు చేసిన ఆస్తుల్లో కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి, బూనేటి చాణక్య, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి తదితరులకు చెందిన బ్యాంక్ బ్యాలెన్సులు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, భూములు, ఇతర స్థిరాస్తులు ఉన్నాయి. 

ఏపీలో 2019కి ముందు మద్యం వ్యాపారం పారదర్శకంగా, డిజిటల్ ట్రాకింగ్‌తో జరిగేదని, అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కావాలనే ఆటోమేటెడ్ విధానాన్ని రద్దు చేసి మాన్యువల్ విధానాన్ని తీసుకొచ్చిందని ఈడీ పేర్కొంది. ఈ కొత్త విధానం ద్వారా అధికారులకు విచక్షణాధికారాలు కట్టబెట్టి, తమకు నచ్చిన బ్రాండ్లకు అనుకూలంగా వ్యవహరించారని దర్యాప్తులో తేలింది. ఆర్డర్లు ఇవ్వాలంటే 15 నుంచి 20 శాతం ముడుపులు ఇవ్వాలని డిస్టిలరీలను సిండికేట్ సభ్యులు డిమాండ్ చేశారని, నిరాకరించిన వారి చెల్లింపులు నిలిపివేశారని ఈడీ ఆరోపించింది. 

ఈ అక్రమాల వల్ల ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.3,500 నుంచి రూ.4,000 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. వసూలు చేసిన ముడుపులను హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో దాచిపెట్టి, అక్కడి నుంచి తరలించినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో కీలక నిందితులు 'సిగ్నల్ వంటి ఎన్‌క్రిప్టెడ్ యాప్స్ ద్వారా సంభాషణలు జరిపారని, దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఈడీ స్పష్టం చేసింది.
 

Be the first to react

More Coverage

MadanaPalli: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. మదనపల్లె టీడీపీలో కొత్త జోష్.. మహిళా అధ్యక్షురాలిగా బైగారి భారతి నాయుడు నియామకం!

MadanaPalli: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. మదనపల్లె టీడీపీలో కొత్త జోష్.. మహిళా అధ్యక్షురాలిగా బైగారి భారతి నాయుడు నియామకం!

MadanaPalli: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో కీలకమైన అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహ…

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: ఈ ఆర్‌ఓబీ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించను…