Nara Lokesh: లోకేష్ భుజం తట్టిన మోదీ - యువ నాయకత్వానికి ప్రధాని అభినందనలు.. ఢిల్లీలో ఏపీ మంత్రుల సందడి! AP Govnt: ఏపీ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది ఖాతాల్లోకి త్వరలోనే నగదు జమ.! Chandrababu: కూటమి నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్.. పండుగ వాతావరణంలో సంబరాలకు సిద్ధమైన జనసేన, బీజేపీ, టీడీపీ.! Amaravati Bill: Ma మా Vi వివేకా Gun గుండెపోటు! మన రాజధానికి ఎగతాళిగా బాబాయి హత్య! క్రిమినల్ జగన్ డైవర్ట్ రాజకీయం! Chandrababu: నేడు బిజీబిజీగా ముఖ్యమంత్రి.. కడప, హైదరాబాద్, ఉండవల్లి పర్యటనలు! Praja Vedika: నేడు (02/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌ పనులు స్పీడ్ అప్! భూమి పూజకు ముహూర్తం ఫిక్స్! Chandrababu: జై శ్రీరామ్.. జై అమరావతి.. ఒంటిమిట్టలో భక్తిపారవశ్యం, రాజధాని బిల్లుపై చంద్రబాబు హర్షం.! Pawan Kalyan: అమరావతికి లోక్‌సభ అభయం.. నేతన్నలకు, రైతన్నలకు వందనం! పవన్ కల్యాణ్ ప్రశంసలు.. Jagan Plan B: ఇదేందయ్యా ఇది... జగన్ పేరుతో కొత్త రాజధానా? Nara Lokesh: లోకేష్ భుజం తట్టిన మోదీ - యువ నాయకత్వానికి ప్రధాని అభినందనలు.. ఢిల్లీలో ఏపీ మంత్రుల సందడి! AP Govnt: ఏపీ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది ఖాతాల్లోకి త్వరలోనే నగదు జమ.! Chandrababu: కూటమి నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్.. పండుగ వాతావరణంలో సంబరాలకు సిద్ధమైన జనసేన, బీజేపీ, టీడీపీ.! Amaravati Bill: Ma మా Vi వివేకా Gun గుండెపోటు! మన రాజధానికి ఎగతాళిగా బాబాయి హత్య! క్రిమినల్ జగన్ డైవర్ట్ రాజకీయం! Chandrababu: నేడు బిజీబిజీగా ముఖ్యమంత్రి.. కడప, హైదరాబాద్, ఉండవల్లి పర్యటనలు! Praja Vedika: నేడు (02/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌ పనులు స్పీడ్ అప్! భూమి పూజకు ముహూర్తం ఫిక్స్! Chandrababu: జై శ్రీరామ్.. జై అమరావతి.. ఒంటిమిట్టలో భక్తిపారవశ్యం, రాజధాని బిల్లుపై చంద్రబాబు హర్షం.! Pawan Kalyan: అమరావతికి లోక్‌సభ అభయం.. నేతన్నలకు, రైతన్నలకు వందనం! పవన్ కల్యాణ్ ప్రశంసలు.. Jagan Plan B: ఇదేందయ్యా ఇది... జగన్ పేరుతో కొత్త రాజధానా?

Amaravati Bill: Ma మా Vi వివేకా Gun గుండెపోటు! మన రాజధానికి ఎగతాళిగా బాబాయి హత్య! క్రిమినల్ జగన్ డైవర్ట్ రాజకీయం!

Amaravati Bill: పార్లమెంటులో అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ జరగకుండా ఉండేందుకు జగన్ 'మావిగన్' అనే వింత పేరును తెరపైకి తెచ్చారు. అసలు చర్చను పక్కదారి పట్టించి సోషల్ మీడియాను ట్రాప్ చేయడంలో జగన్ వేసిన వ్యూహం..

Published : 2026-04-02 11:52:00

Amaravati Bill: అమరావతి రాజధాని చట్టబద్ధత అంశం పార్లమెంటు గడప తొక్కిన వేళ, ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమరావతికి ఉన్న అంతర్జాతీయ గుర్తింపును, చట్టపరమైన రక్షణను దెబ్బతీయడం సాధ్యం కాదని తేలిపోవడంతో.. వ్యూహకర్తగా పేరున్న జగన్ సరికొత్త 'డైవర్షన్' రాజకీయాన్ని తెరపైకి తెచ్చారు. అదే "మావిగన్" ప్రతిపాదన. పార్లమెంటులో తన వైఫల్యాల మీద చర్చ జరగకుండా, ప్రజల దృష్టిని మళ్లించడంలో ఆయన వేసిన క్రిమినల్ ప్లాన్ ప్రస్తుతానికి పారినట్లే కనిపిస్తోంది.

అసలు అమరావతి పేరును మార్చడం తనవల్ల కాదని జగన్‌కు స్పష్టమైన అవగాహన ఉంది. రాజధానిగా అమరావతిని మార్చలేమని కేంద్రం పదేపదే చెబుతున్న తరుణంలో, అక్కడ చర్చ జరిగితే దేశవ్యాప్తంగా తన పరువు పోతుందని ఆయన భయపడ్డారు. అన్ని రాజకీయ పార్టీలు తన మొండి వైఖరిని తప్పుబట్టే అవకాశం ఉండటంతో, దాన్ని అడ్డుకోవడానికి "మావిగన్" అనే వింత పేరును తెరపైకి తెచ్చారు. ఇది వినడానికి హాస్యాస్పదంగా ఉన్నా, దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ప్రజలను, సోషల్ మీడియాను చర్చల్లో ముంచెత్తడమే.

నిజానికి, ఈ పేరు వెనుక ఉన్న క్రూరమైన వ్యంగ్యాన్ని ప్రజలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. 'మావిగన్' అనే పదంలో ఉన్న అక్షరాలను విశ్లేషిస్తే.. అందులో ఒక గూఢార్థం దాగి ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 'మా' అంటే మా, 'వి' అంటే వివేకం, 'గన్' అంటే గన్‌తో గుండెపోటు అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. తన సొంత బాబాయి హత్య ఉదంతాన్ని గుర్తుచేసేలా ఈ పద ప్రయోగం ఉండటం గమనార్హం. రాజధాని లాంటి పవిత్రమైన ప్రాంతానికి ఇలాంటి పేరును ఆపాదించడం ద్వారా ఆయన దేనిని సాధించాలనుకున్నారో అర్థం కావడం  లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

జగన్ వేసిన ఈ ట్రాప్‌లో సోషల్ మీడియా యథావిధిగా పడిపోయింది. ప్రస్తుతం ఫేస్‌బుక్, ట్విట్టర్ (ఎక్స్) వేదికల్లో అమరావతి చట్టబద్ధత గురించి కాకుండా, 'మావిగన్' మీద వచ్చే మీమ్స్, బూతులు, విమర్శలే హైలైట్ అవుతున్నాయి. అసలు చర్చ పక్కదారి పట్టి, కేవలం ఈ కామెడీ పేరు చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. 

 ఇలాంటి తాత్కాలిక విజయాలు ఎంతో కాలం నిలబడవు. ఒక రాజధాని సెంటిమెంట్‌తో ఆడుకోవడం, ప్రజల ఆశలను వెక్కిరించడం వంటి చర్యలు భవిష్యత్తులో వైకాపాకు శాపంగా మారే అవకాశం  ఉండనుంది. డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా ఈరోజు గట్టెక్కినా, రేపు ప్రజల తీర్పు ముందు నిలబడక తప్పదు. ఈ 'మావిగన్' పాపం ఆ పార్టీని వేటాడుతూనే ఉంటుంది. అమరావతిని అవమానించిన ప్రతిసారీ ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటూనే ఉంటుంది. జగన్ అనుకున్న డైవర్షన్ రాజకీయాలు ప్రస్తుతానికి విజయవంతమైనా, చరిత్రలో ఇది ఒక చీకటి అధ్యాయంగానే మిగిలిపోతుంది అని చెప్పుకోవడంలో సందేహమే లేదు..

Spotlight

Read More →