ప్రజల అంగీకారం లేకుండా ఇళ్లకు స్మార్ట్మటర్లు బిగించొద్దని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రజామోదం లేనిదే ఏ విషయంలోనూ ముందుకు వెళ్లకూడదన్నారు. విశాఖపట్నంలో విద్యుత్శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ప్రస్తుతం పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు మాత్రమే స్మార్టీమీటర్లు బిగించనున్నట్లు మంత్రి తెలిపారు. వ్యవసాయానికి వీటిని బిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. స్మార్ట్మీటర్లపై సోషల్మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పీఎం సూర్యఘర్పై ప్రజలకు అవగాహన కల్పించాలని.. ప్రతి నియోజకవర్గంలో 10 వేల కనెక్షన్లు ఇవ్వాలన్నారు. శ్రీకాకుళ, విజయనగరం జిల్లాల్లో లో వోల్టేజ్ సమస్యలను పరిష్కరించాలని ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజను మంత్రి గొట్టిపాటి ఆదేశించారు.