పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్టు పనులను ఇప్పటివరకు ప్రారంభించలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపిందని, ఆ విషయాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ రాజ్యసభకు తెలియజేసింది.
కాంగ్రెస్ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ప్రాజెక్టుకు సంబంధించిన ఫ్రీ ఫీజిబిలిటీ నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి సమర్పించినట్టు వెల్లడించింది. అయితే, ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లేఖ రాసినట్లు కేంద్రం తెలిపింది.
ప్రాజెక్టుపై సంబంధిత అధికారులు, పరివాహక ప్రాంత రాష్ట్రాలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని జల్ శక్తి శాఖ వివరించింది.