LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

AP HighCourt: విదేశాలకు వెళ్లిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం.. హైకోర్టు కీలక ఆదేశాలు.!

AP HighCourt: విదేశీయానం చేసిన అర్చకులు దేవస్థానాల ప్రధాన గర్భాలయాల్లోకి ప్రవేశించి, పూజలు నిర్వహించడానికి వీల్లేదంటూ దేవాదాయ శాఖ (దార్మిక పరిషత్), శృంగేరి శారదా పీఠం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ను హైకోర్టు ఆదేశించింది.

AndhraPravasi News Desk 1 min read
AP HighCourt: విదేశాలకు వెళ్లిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం.. హైకోర్టు కీలక ఆదేశాలు.!
  • Politics: "సంప్రదాయం ఉల్లంఘిస్తే అంతే": గర్భాలయ పూజారులపై హైకోర్టు సీరియస్..
     
  • విజయవాడ దుర్గగుడి అర్చకుడి పిటిషన్‌తో కదిలిన యంత్రాంగం: విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు..

AP HighCourt: విదేశీయానం చేసిన అర్చకులు దేవస్థానాల ప్రధాన గర్భాలయాల్లోకి ప్రవేశించి, పూజలు నిర్వహించడానికి వీల్లేదంటూ దేవాదాయ శాఖ (దార్మిక పరిషత్), శృంగేరి శారదా పీఠం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మార్చి 30న ఉత్తర్వులిచ్చారు. ఈ అంశానికి సంబంధించి దేవాదాయ శాఖ 2010 నవంబరు 10న జారీ చేసిన సర్క్యులర్, శృంగేరి శారదా పీఠం జగద్గురువులు మహాతీర్థ భారతీస్వామి 2024 డిసెంబరు 20న విడుదల చేసిన ప్రామాణికను అమలు చేయడం లేదంటూ విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన శ్రీచక్ర నవావరణ అర్చన పారాయణదారు డీఎస్ఎస్ఎస్ సుబ్రహ్మణ్యం సోమయాజి వ్యాజ్యం దాఖలు చేశారు. 

పిటిషనర్ తరపు న్యాయవాది కేఆర్ శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ విదేశీయానం చేసిన అర్చకులను నిబంధనలకు విరుద్ధంగా దేవస్థానాల్లోని ప్రధాన గర్భాలయాల్లో పూజలు చేసేందుకు అనుమతిస్తున్నారన్నారు. ధార్మిక పరిషత్ సర్క్యులర్, శారదాపీఠం ప్రామాణిక ప్రకారం అర్చకులకు విదేశాలకు వెళ్లడానికి అనుమతి లేదని తెలిపారు. ఎవరైనా వెళ్లాల్సిందేనని పట్టుబడితే అనుమతి ఇవ్వవచ్చని. తిరిగి వచ్చాక వారిని ఆలయం వెలుపల జరిగే పూజలు, వ్రతాలకు మాత్రమే అనుమతిస్తారని వెల్లడించారు. భారతీస్వామి ప్రామాణిక ప్రకారం.. రోజూ త్రికాల సంధ్యావందనం, గురు ఉపదేశ మంత్ర జపం, వేద అధ్యయనం, ఆహార నియమాలు, కఠిన ఆధ్యాత్మిక క్రమశిక్షణ పాటించిన వారు గర్భాలయాల్లో పూజలు చేసేందుకు అర్హులని వివరించారు. విదేశాలకు వెళ్లినవారు, సంప్రదాయాలకు విరుద్ధంగా ముఖ క్షవరం, జుట్టు కత్తిరించుకున్న వారు గర్భాలయంలో పూజలు చేయడానికి వీల్లేదని ప్రామాణిక చెబుతోందన్నారు. దీనిపై దేవాదాయ శాఖ తరపు న్యాయవాది స్పందిస్తూ. సర్క్యులర్, ప్రామాణికలను అనుసరిస్తామన్నారు..

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…