LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Amit Shah: కచ్ అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల్లో అమిత్ షా పర్యటన!

Amit Shah: కచ్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ కీలక పర్యటన చేపట్టనున్నారు. గుజరాత్ పర్యటనలో భాగంగా రెండో రోజు ఆయన వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న హరామి నాలా మరియు క్రీక్ ప్రాంతాలను సందర్శించనున్నారు.

AndhraPravasi News Desk 1 min read
Amit Shah: కచ్ అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల్లో అమిత్ షా పర్యటన!

హరామి నాలా ప్రాంతాన్ని సందర్శించనున్న కేంద్ర మంత్రి అమిత్ షా..

కచ్‌లో బీఎస్ఎఫ్ భద్రతా ఏర్పాట్లపై అమిత్ షా సమీక్ష..

కచ్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ కీలక పర్యటన చేపట్టనున్నారు. గుజరాత్ పర్యటనలో భాగంగా రెండో రోజు ఆయన వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న హరామి నాలా మరియు క్రీక్ ప్రాంతాలను సందర్శించనున్నారు. ఈ ప్రాంతాలు భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దుకు అత్యంత సున్నితమైన ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి.

ఈ సందర్భంగా సరిహద్దు భద్రత కోసం బీఎస్ఎఫ్ ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను అమిత్ షా సమీక్షించనున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఎదురవుతున్న భద్రతా సవాళ్లపై ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా చర్చించనున్నారు. అనంతరం బోర్డర్ అవుట్‌పోస్ట్ G-7ను ప్రారంభించి, అక్కడ విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ సిబ్బందితో ముచ్చటించనున్నారు.

తర్వాత OP టవర్ 1170లోని కంట్రోల్ రూమ్‌ను సందర్శించి, హరామి నాలా ప్రాంతంలో బోట్ టూర్ కూడా చేయనున్నారు. సరిహద్దు ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ జెట్టీ పాయింట్ వద్ద వృక్షారోపణ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

రోజు చివర్లో భుజ్‌లోని బీఎస్ఎఫ్ సెక్టార్ హెడ్‌క్వార్టర్స్‌లో సరిహద్దు సమస్యలపై ఉన్నతస్థాయి సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించనున్నారు. సరిహద్దు భద్రతను మరింత బలోపేతం చేసే అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది.

గత ఆరు నెలల్లో అమిత్ షా కచ్ ప్రాంతాన్ని సందర్శించడం ఇది రెండోసారి కావడం విశేషం. గత ఏడాది నవంబర్‌లో బీఎస్ఎఫ్ రైజింగ్ డే జాతీయ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన భుజ్‌కు వచ్చిన విషయం తెలిసిందే.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…