LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతి!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

Australia: ఆస్ట్రేలియాలో అమరావతి కోసం ఐక్యంగా తెలుగు తమ్ముళ్ళు..

Australia: ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజలు అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మద్దతు తెలుపుతూ ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగు కుటుంబాలు పాల్గొని ఐక్యతను చాటుకున్నారు.

AndhraPravasi News Desk 1 min read
Australia: ఆస్ట్రేలియాలో అమరావతి కోసం ఐక్యంగా తెలుగు తమ్ముళ్ళు..

ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో బ్రిస్బేన్‌లో అమరావతి సంబరాలు..

విదేశాల్లోనూ అమరావతి కోసం ఐక్యంగా తెలుగు కుటుంబాలు.. 

ఆస్ట్రేలియా బ్రిస్బేన్ లో నివసిస్తున్న తెలుగు ప్రజలు అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తిస్తూ ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నారు. ఎన్‌ఆర్‌ఐ టీడీపీ బ్రిస్బేన్  విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం భారీగా జరిగింది.

ఈ వేడుకలకు బ్రిస్బేన్లో ఉన్న తెలుగు కుటుంబాలు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై తమ ఐక్యతను చాటుకున్నారు. ఈ కార్యక్రమాన్ని గూడూరు రామ కృష్ణ సమన్వయం చేశారు.  కార్యక్రమంలో వైట్ల హరి, బోదెపుడి నగేష్, ఈదర అనురాధ, డా. బోదెపుడి నాయుడు, రాచా నరేష్, గుత్తా రంగరావు, గిరిధర్, గౌతమ్, ఎర్రమంచు శివ, కృష్ణ, అన్నే శశి, అన్నే శాంతి తదితరులు పాల్గొన్నారు. అలాగే జనసేన అభిమానులు దీపక్, హేమ నాయుడు, గనిశెట్టి కులదీప్ పాల్గొన్నారు.

అమరావతి నిర్మాణం రాష్ట్ర అభివృద్ధికి కీలకమని, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి దిశగా నడిపించే ప్రధాన కేంద్రంగా నిలుస్తుందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా వారు పేర్కొన్నారు.

విదేశాల్లో ఉన్నా తమ మాతృభూమి పట్ల ఉన్న బాధ్యతను మరవకూడదని నిర్వాహకులు తెలిపారు. అమరావతి నిర్మాణానికి మద్దతు తెలపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు.

వేడుకలలో భాగంగా జెండా ఆవిష్కరణ, కేక్ కట్టింగ్, దేశభక్తి నినాదాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మొత్తం కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగి, పాల్గొన్న వారిలో ఆనందాన్ని నింపింది.

ఈ భారీ సమాహారం బ్రిస్బేన్ లోని తెలుగు సమాజ ఐక్యతను ప్రతిబింబించింది. అమరావతి రాజధాని కోసం తమ మద్దతు ఎల్లప్పుడూ కొనసాగుతుందని పాల్గొన్నవారు స్పష్టం చేశారు.

కార్యక్రమం చివరలో నిర్వాహకులు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ వేడుకలు అందరిలో గర్వభావాన్ని, ఐక్యతను మరింత బలపరిచాయని పేర్కొన్నారు.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…