LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

Iran: ఇరాన్‌కు భారత్ మానవతా సాయం.. ఇరాన్ రాయబార కార్యాలయం హృదయపూర్వక కృతజ్ఞతలు.!

Iran India Sends Medicare: అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇరాన్‌కు భారత్ మానవతా దృక్పథంతో అండగా నిలిచింది. యుద్ధం కారణంగా మందుల కొరతతో అల్లాడుతున్న ఆ దేశానికి అత్యవసర వైద్య సామాగ్రితో కూడిన తొలి విడత సాయాన్ని అందించింది.

AndhraPravasi News Desk 2 min read
Iran: ఇరాన్‌కు భారత్ మానవతా సాయం.. ఇరాన్ రాయబార కార్యాలయం హృదయపూర్వక కృతజ్ఞతలు.!
  • ఇరాన్‌కు భారత్ భారీ ఊరట: యుద్ధ సంక్షోభంలో మానవతా సాయం అందించిన న్యూఢిల్లీ..
     
  • విదేశాంగ శాఖ చర్చలు సఫలం: ఇరాన్‌కు వైద్య పరికరాల పంపిణీ ప్రక్రియ ప్రారంభం..

Iran India Sends Medicare: అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడుల కారణంగా తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న ఇరాన్‌ను ఆదుకునేందుకు భారత్ మానవతా దృక్పథంతో ముందుకొచ్చింది. యుద్ధం కారణంగా ఆసుపత్రుల్లో మందుల కొరత ఏర్పడి, గాయపడిన పౌరులు అల్లాడుతున్న తరుణంలో, భారత ప్రభుత్వం అత్యవసర వైద్య సామాగ్రితో కూడిన తొలి విడత సాయాన్ని ఆ దేశానికి పంపింది. ఈ సహాయం సురక్షితంగా తమకు చేరినట్లు ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. ఫిబ్రవరి 28 నుంచి నిరంతరం కొనసాగుతున్న దాడుల వల్ల ఇరాన్‌లో పెను మానవతా సంక్షేపం నెలకొనడంతో, మందులు మరియు ఇతర వైద్య పరికరాల అవసరం భారీగా పెరిగింది. ఈ క్లిష్ట సమయంలో భారత్ అందించిన చేయూత పట్ల ఇరాన్ ప్రభుత్వం మరియు అక్కడి ప్రజలు తమ కృతజ్ఞతలను చాటుకున్నారు.

భారతదేశం పంపిన ఈ తొలి విడత వైద్య సామాగ్రిని 'ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ' ప్రతినిధులు అందుకున్నారు. ఈ పరిణామంపై న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం బుధవారం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, దయార్ద్ర హృదయంతో స్పందించిన భారత ప్రజలకు మరియు ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసింది. యుద్ధం వల్ల వేలాది మంది ప్రజలు క్షతగాత్రులుగా మారుతున్న వేళ, భారత్ అందించిన ఈ మందులు ఎంతో మంది ప్రాణాలను కాపాడతాయని వారు పేర్కొన్నారు. ఇప్పటికే చైనా, రష్యా, అజర్‌బైజాన్ వంటి దేశాలు కూడా ఇరాన్‌కు తమ వంతు సహాయాన్ని అందిస్తుండగా, భారత్ కూడా ఈ జాబితాలో చేరి తన అంతర్జాతీయ బాధ్యతను చాటుకుంది.

ఇరాన్‌కు మానవతా సాయం అందించే అంశంపై భారత విదేశాంగ శాఖ గత కొద్ది రోజులుగా జరుపుతున్న చర్చలు సఫలమవ్వడంతో ఈ పంపిణీ ప్రక్రియ వేగవంతమైంది. మరోవైపు, యుద్ధ క్షేత్రంలో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను, విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తరలింపు చర్యలను ముమ్మరం చేసింది. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైతే మరిన్ని విడతల్లో వైద్య మరియు ఆహార సాయాన్ని అందించేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ఈ చర్యలు ఇరు దేశాల మధ్య ఉన్న దౌత్యపరమైన సంబంధాలను మరియు విపత్తు సమయాల్లో భారత్ చూపే చొరవను మరోసారి నిరూపించాయి.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…