LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

బతుకుదెరువు కోసం వెళ్లి బందీగా మారి.. యజమాని వేధింపులు.. ఖల్లివెల్లి కేసులో నిర్బంధం!

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాజారం గ్రామానికి చెందిన కట్టు తిరుపతిని ఇండియాకు వెళ్లకుండా దుబాయి ఏర్ పోర్ట్ ఇమ్మిగ్రేషన్ అధికారులు 'ఎగ్జిట్ క్లియరెన్స్' నిరాకరించి పోలీసులకు అప్పగించిన సంఘటన ఎప్రిల్ 12న జరిగింది.

AndhraPravasi News Desk 1 min read
బతుకుదెరువు కోసం వెళ్లి బందీగా మారి.. యజమాని వేధింపులు.. ఖల్లివెల్లి కేసులో నిర్బంధం!
  • NRI: దుబాయి పోలీసుల అదుపులో  జగిత్యాల జిల్లా గల్ఫ్ కార్మికుడు..
     
  • ఇండియాకు వెళ్లకుండా దుబాయి ఏర్ పోర్ట్ లో నిలిపివేసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు… 

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాజారం గ్రామానికి చెందిన కట్టు తిరుపతిని ఇండియాకు వెళ్లకుండా దుబాయి ఏర్ పోర్ట్ ఇమ్మిగ్రేషన్ అధికారులు 'ఎగ్జిట్ క్లియరెన్స్' నిరాకరించి పోలీసులకు అప్పగించిన సంఘటన ఎప్రిల్ 12న జరిగింది. జీవనోపాధి కోసం జనవరి 10న దుబాయికి చేరుకున్న తిరుపతికి యాజమాన్యం జీతం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడంతో... కంపెనీ నుండి వెళ్ళిపోయి ఇతర చోట్ల పని కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. కాగా యజమాని అతన్ని పరారైన కార్మికుడు (ఖల్లివెల్లి)  గా ప్రభుత్వం వద్ద నమోదు చేసినట్లు సమాచారం. ఇతని స్వగ్రామం ఎండపెల్లి మండలం చర్లపల్లి, కాగా అత్తవారి ఊరు రాజారంలో నివసిస్తున్నాడు.

తిరుపతికి, ప్రభుత్వం పక్షాన న్యాయవాదిని సమకూర్చి 'న్యాయ సహాయం' (లీగల్ ఎయిడ్,) అందించి, విడుదల చేయించి స్వదేశానికి తెప్పించాలని అతని భార్య రజిత శుక్రవారం (15.05.2026) హైదరాబాద్ బేగంపేట లోని స్టేట్ లెవల్ 'సీఎం ప్రవాసీ ప్రజావాణి' లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ల పేరిట వినతిపత్రం సమర్పించారు. ఆయనపై ఏవో ఆరోపణలు మోపి శిక్ష విధించే అవకాశం ఉందనే భయం ఉంది. కాబట్టి, ఆయన నిర్బంధానికి గల ఖచ్చితమైన కారణం, ఏవైనా కేసులు, ఆరోపణలు ఉన్నాయా అనే విషయాలను తెలుసుకొని చెప్పాలని ఆమె కోరారు.

స్పందించిన 'సీఎం ప్రజావాణి' ఇంచార్జి, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ డా. జి. చిన్నారెడ్డి తగిన చర్యలు తీసుకోవాలని జిఏడి ఎన్నారై విభాగం అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, 'సీఎం ప్రవాసీ ప్రజావాణి' హెల్ప్ డెస్క్ లైజన్ ఆఫీసర్ భార్గవి నద్దునూరి, వాలంటీర్ ప్రీతి సువర్చల తదితరులు పాల్గొన్నారు. బాధితున్ని ప్రభుత్వం ఆదుకోవాలని గల్ఫ్ కార్మిక నాయకుడు అమరగొండ తిరుపతి కోరారు.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…