LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతి!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

Kuwait: మాలేపాటి సురేష్ బాబు ఆధ్వర్యంలో వేడుకలు.. కువైట్ కృష్ణాస్ రెస్టారెంట్‌లో సందడిగా ఎన్ఆర్ఐ టీడీపీ ప్రోగ్రామ్.!

Kuwait NRI TDP program: కువైట్‌లో మాలేపాటి సురేష్ బాబు నాయుడు గారి అద్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని హవల్లీ ఏరియాలోని కృష్ణాస్ రెస్టారెంట్‌లో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించాము. ప్రస్తుతం కువైట్‌లో ఉన్న యుద్ధ వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, పెద్ద ఎత్త…

AndhraPravasi News Desk 1 min read
Kuwait: మాలేపాటి సురేష్ బాబు ఆధ్వర్యంలో వేడుకలు.. కువైట్ కృష్ణాస్ రెస్టారెంట్‌లో సందడిగా ఎన్ఆర్ఐ టీడీపీ ప్రోగ్రామ్.!
  •  
  • Associations: నిబంధనల మధ్యే పసుపు పండుగ: 50 మంది సభ్యులతో పరిమితంగా జరిగిన టీడీపీ వేడుకలు..
     
  • "కువైట్ గడ్డపై మిన్నంటిన టీడీపీ ఆవిర్భావ సంబరాలు": యుద్ధ వాతావరణంలోనూ తగ్గని కార్యకర్తల ఉత్సాహం..

NRI TDP program: కువైట్‌లో మాలేపాటి సురేష్ బాబు నాయుడు గారి అద్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని హవల్లీ ఏరియాలోని కృష్ణాస్ రెస్టారెంట్‌లో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించాము. ప్రస్తుతం కువైట్‌లో ఉన్న యుద్ధ వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, పెద్ద ఎత్తున గుమికూడకుండా సుమారు 50 మంది సభ్యులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము.

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీపై ప్రతి ఒక్కరూ తమ అనుభవాలను పంచుకున్నారు. కువైట్‌లో ఎన్నో సంవత్సరాలుగా ఈ పార్టీకి అనేక మంది అభిమానులు, కార్యకర్తలు ఉండడం, ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతుండడం గర్వకారణం. అలాగే ఒకే చోట అందరూ కలవడం సాధ్యం కాకపోవడంతో, సభ్యులు తమకు అనుకూలమైన ప్రదేశాల్లో చిన్న చిన్న వేడుకలు నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇదే సందర్భంగా, నిన్న ఎన్ఆర్ఐ టిడిపి తరపున జూమ్ మీటింగ్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, డా. వేమూరి రవి గారు, బుచ్చి రాంప్రసాద్ గారు, హక్కిలి నాగేంద్రబాబు గారు, రావి రాధాకృష్ణ గారు, చప్పిడి రాశేఖర్ గారు పాల్గొని మాతో మమేకమై మాకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరిగింది. రాబోయే మహానాడు కార్యక్రమాన్ని యుద్ధ వాతావరణ పరిస్థితులు అనుకూలించిన వెంటనే ఘనంగా నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. కువైట్‌లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి కార్యకర్తకు, అలాగే హాజరైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…