LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

AP IT Investments: చంద్రబాబు, లోకేష్ నాయకత్వంలో ఐటీ విప్లవం: న్యూజెర్సీ వేదికగా మన్నవ మోహన కృష్ణ పిలుపు.!!

Andhra Pradesh IT Sector: అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ఐటీ సర్వ్ సదస్సులో APTS ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ పాల్గొన్నారు. ఏపీలో ఐటీ విప్లవం, గూగుల్, క్వాంటం వ్యాలీ ప్రాజెక్టుల ద్వారా రానున్న అవకాశాలను వివరిస్తూ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఐటీ పారిశ్రామికవేత్తలను కోరారు

AndhraPravasi News Desk 2 min read
AP IT Investments: చంద్రబాబు, లోకేష్ నాయకత్వంలో ఐటీ విప్లవం: న్యూజెర్సీ వేదికగా మన్నవ మోహన కృష్ణ పిలుపు.!!

New Jersey:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది.  అందులో భాగంగా ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ గారు ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తూ, అక్కడి ఐటీ దిగ్గజాలను ఏపీ వైపు ఆకర్షిస్తున్నారు. తాజాగా న్యూజెర్సీలో జరిగిన 'ఐటీ సర్వ్' సదస్సులో ఆయన పాల్గొని, వందలాది మంది ఐటీ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి భేటీ అయ్యారు. ఏపీలో ఉన్న అపారమైన అవకాశాలను వారికి వివరిస్తూ, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

మన్నవ మోహన కృష్ణ గారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి విజన్ వల్ల ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ ఐటీ విప్లవం మొదలైందని స్పష్టం చేశారు. గతంలో హైదరాబాద్‌ను ఐటీ మ్యాప్‌లో ఎలా నిలబెట్టారో, ఇప్పుడు ఏపీని కూడా అదే స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని వివరించారు. ముఖ్యంగా గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థల రాక, ప్రతిష్టాత్మక 'క్వాంటం వ్యాలీ' ప్రాజెక్టులతో ఏపీ రూపురేఖలు మారిపోబోతున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

పెట్టుబడిదారులకు ఏపీ ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాల గురించి ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. పరిశ్రమల స్థాపనకు కావాల్సిన అనుమతులను వేగంగా మంజూరు చేస్తామని, మౌలిక సదుపాయాల కల్పనలో రాజీ పడబోమని మన్నవ హామీ ఇచ్చారు. "మీరు ఏపీకి రండి.. మీ పెట్టుబడులకు, ఆలోచనలకు మా ప్రభుత్వం పూర్తి భద్రత  సహకారం అందిస్తుంది" అని మోహన కృష్ణ గారు పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. ఏపీలో నైపుణ్యం కలిగిన యువతకు కొదవ లేదని, వారిని ఐటీ రంగంలో వాడుకోవాలని కోరారు.

మన్నవ మోహన కృష్ణ గారి విజ్ఞప్తికి ఐటీ పారిశ్రామికవేత్తల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తాము ఎంతో ఆసక్తిగా ఉన్నామని వారు ఈ సందర్భంగా ప్రకటించారు. చంద్రబాబు గారి నాయకత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, రాష్ట్ర అభివృద్ధిలో తాము కూడా భాగస్వాములం అవుతామని సానుకూలంగా స్పందించారు. 

న్యూజెర్సీ ఐటీ సర్వ్ ప్రెసిడెంట్ రమేష్ గార్లపాటి గారు మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ అభినందనీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఐటీ సర్వ్ ప్రతినిధులు, తెలుగు ఎన్నారై పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన్నవ మోహన కృష్ణ గారు ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడి, వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ పర్యటన ద్వారా ఏపీకి భారీగా ఐటీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మన్నవ అమెరికా పర్యటన ఏపీ ఐటీ రంగానికి కొత్త ఊపిరి పోస్తుందనడంలో సందేహం లేదు.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…