టీ అది ఒక అద్భుతమైన ఫీలింగ్ ఉదయాన్నే లేచి ఒకటి తీసుకుంటే ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. . ఒక్కరోజు టీ తాగకపోతే తల మీద భారం పడుతున్నట్లే ఫీల్ అవుతారు. బెల్లం టీ ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని మీరు పొందవచ్చు. చక్కెర ఎంత తక్కువ ఉపయోగిస్తే అంతా మేలు జరుగుతుందని ప్రస్తుతం డాక్టర్ లు సైతం తెలుపుతున్నారు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.
బెల్లం టీ తయారికి కావలసిన పదార్థాలు ఒక కప్పు నీరు, ఒక కప్పు పాలు, రెండు టీ స్పూన్ల టీ పొడి, ఒక అంగుళం అల్లం ముక్క, రెండు పచ్చి ఏలకులు, నాలుగు టీ స్పూన్ల బెల్లం.
ముందుగా ఒక చిన్న పాత్రలో నీరు పోసి మీడియం మంటపై మరిగించండి. అందులో అల్లం ముక్కలు, పచ్చి ఏలకులు వేసి రెండు నిమిషాలు మరిగించాలి. తర్వాత బెల్లం వేసి కరిగే వరకు బాగా కలపాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత టీ పొడి వేసి మరో రెండు నిమిషాలు మరిగించండి. చివరగా వేడి పాలను ఈ మిశ్రమంలో జోడించి ఒక సారి మరీ మరిగించి స్టౌ ఆఫ్ చేయండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ టి మీరు తాగాల్సినప్పుడు మాత్రమే పెట్టుకోండి.

బెల్లం టీ ఆరోగ్య ప్రయోజనాలు శీతాకాలంలో వాతావరణ మార్పుల సమయంలో తాగడం ఎంతో మేలు చేస్తుంది. ఇది గొంతులో ఉండే ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది దగ్గు, జలుబుకు సహజమైన నివారణగా పనిచేస్తుంది. బెల్లం మరియు అల్లం కలయిక శరీరంలో వేడి పెంచి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే ఈ టీ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచి జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.
రోజూ ఉదయం ఒక కప్పు బెల్లం టీ తాగడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తహీనత ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది, ఎందుకంటే బెల్లంలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది ఒక సహజ ఔషధం దగ్గు, జలుబు వంటి సమస్యలను దూరం చేస్తుంది వర్షాలు అధికంగా ఉండడం వల్ల ఒకసారి ఇది ట్రై చేయండి మీ ఆరోగ్యాన్ని పదులపరుచుకోండి.
ఈ సమాచారం కేవలం అవగాహనకు మాత్రమే మీ ఆరోగ్య రీత్యా ముందుగా మీ డాక్టర్ ని సంప్రదించి తీసుకోవడం మంచిది.