విద్యార్థులు దసరా సెలవులు పూర్తి చేసుకుని తిరిగి స్కూల్ కి వెళ్తున్నారు. అయితే ప్రతి ఏడాది దసరా అనేది అక్టోబరు నెలలో నవంబర్ లో దీపావళి వచ్చేది ఏడాది మాత్రం దీపావళి దసరా రెండు ఒకే నెలలో రావడం విశేషం. వచ్చేవారం శనివారం, ఆదివారం మరియు సోమవారం వరుసగా పాఠశాలలు, కాలేజీలు సెలవులు ఉంటాయి. సోమవారం అక్టోబర్ 20 దీపావళి పండుగకు సంబంధించిన సెలవు.
అయితే ఈ సెలవులు స్కూళ్లు కాలేజీలకు మాత్రమే కాకుండా, కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలకు కూడా వర్తిస్తాయి. విద్యార్థులు, ఉద్యోగులు దీన్ని కుటుంబసభ్యులతో కలిసి పండుగను ఘనంగా జరుపుకునేందుకు ఉపయోగించుకోవచ్చు . పండుగను ముందుగా సొంత గ్రామాల్లో పండగను చేసుకోవడానికి ఇప్పటికే టికెట్ బుకింగ్‌లు కూడా మొదలయ్యేని చెప్పుకోవచ్చు.
దీపావళి పండుగ భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. నరకాసురుడిని సంహరించిన తరువాత ప్రజలు దీపాలను వెలిగించి ఆనందాన్ని వ్యక్తం చేశారు. రామాయణం ప్రకారం, శ్రీరాముడు రావణుడిని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత కూడా ప్రజలు దీపాల పండుగను జరుపుకున్నారు. పండుగ ఆనందంలో వర్గం మతం జాతి భేదం ఉండదు.
ఇప్పటి కాలం అంతా రసాయనాలతో కూడిన దీపావళి ఆట బాంబులు ఉంటున్నాయి. కానీ 90's పిల్లలకైతే ఇలాంటి మతాబులు చిచ్చురు బుడులు అనేవి చాలా తక్కువ. అప్పటి కాలంలో తాటి చెట్టుకి వచ్చే పూతతో అవి ఎండబెట్టి మెత్తగా పొడి చేసి నిప్పులో వేసి ఊదుతూ పిల్లలు కేరింతలు చేసేవారు. వాటి నుంచి వచ్చే నిప్పురవ్వల కాంతి దీపావళిని రెట్టింపు చేసేది. కానీ నేటి సమాజంలో అధిక శబ్దాలతో అనేకమైన బాంబులు వచ్చి వాటి వైపే పిల్లల్ని ఆకర్షితులను చేస్తున్నాయి.దీపావళి ఈ ప్రత్యేకంగా, ప్రతి ఇంటిలో వెలుగులు, ఆనందం, సాంప్రదాయ వేడుకలతో జ్ఞాపకాలను పదులపరచుకోండి.