తెలుగు రాష్ట్రాల్లో జ్యోతిష్య శాస్త్రంలో పేరు గాంచిన వేణు స్వామి తన విశిష్ట జ్యోతిష్య విజ్ఞానంతో సినీ, రాజకీయ ప్రముఖుల జీవితాల్లో ముందస్తు సమాచారం ఇచ్చి పాపులారిటీ పొందారు. సమంత, నాగచైతన్యల వివాహ జీవితం సాఫీగా ఉండదని, కొద్ది కాలంలో వీరు విడిపోతారని ఆయన ముందే చెప్పడం సంచలనం సృష్టించింది ఆయన చెప్పినట్లుగానే సమంత నాగచైతన్య విడిపోయారు నాగచైతన్య శోభిత వివాహం చేసుకొని హ్యాపీగా కెరియర్ కొనసాగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
వేణు స్వామి చెప్పిన విషయాలు చాలానే నిజమవుతుండటంతో అతని జ్యోతిష్య శక్తికి విశేష గుర్తింపు లభించింది. ప్రముఖ హీరోయిన్లు డింపుల్ హాయతి, రష్మిక వంటి వారు జాతక దోష నివారణ పూజలు చేసుకోవడం ద్వారా ఆయన ప్రభావం ఎంత స్థాయిలో ఉందో సుస్థిరంగా తెలుస్తోంది. ఆయన చెప్పిన రాజకీయ ఘట్టాల గురించి కూడా కొన్ని సంఘటనలు 2023లో టీడీపీ నేత చంద్రబాబు న్యాయ సమస్యలకు లోనవుతారని ముందే చెప్పడం, తరువాత చంద్రబాబు అరెస్ట్ కావడం దృష్ట్యా ఆయన జ్యోతిష్య శక్తిని అందరూ బలంగా నమ్మారు.
అయితే ఇటీవల కాలంలో జ్యోతిష్యం చెప్పినవన్నీ వ్యతిరేకంగా అవ్వడంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన విషయం కూడా అందరికీ తెలిసిందే. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ రెండూ మరోసారి సీఎంలుగా ప్రమాణస్వీకారం చేస్తారని ఆయన అంచనా వేసినప్పటికీ ఆయన ఊహించినట్లుగా రాలేదు. దీని వల్ల కొంతమంది ప్రజలు ఆయన జ్యోతిష్యాన్ని అబద్ధమని తోసిపుచ్చారు .
తాజాగా హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక నిశ్చితార్థం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే అయితే దీనికి సంబంధించి వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి. యాంకర్ మీరు చెప్పే జ్యోతిష్యాలన్నీ నిజాలే కాబట్టి ఇటీవలే రష్మిక మందన విజయ్ దేవరకొండ ప్రేమించుకున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకున్నారు దీనిపై మీ స్పందన ఏంటి అని అడగగా వేణు స్వామి దీనిపై స్పందించడం జరిగినది.
విజయ్‌తో రష్మిక పెళ్లి చేసుకోవద్దని వివాహం చేసుకున్న విడిపోతారని రష్మి కి నేను ముందే చెప్పానని ఆయన చెప్పడం జరిగినది.ఈ వివాహంలో అనేక దోషాలు ఉన్నాయని వీరు పెళ్లి చేసుకున్న తరువాత వివాదాలు చుట్టుముడతాయని ఆయన చెప్పారట అయినా రష్మిక పట్టించుకోలేదని అప్పటినుంచి ఆయనతో మాట్లాడడం లేదని ఆయన వివరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.