పత్తికొండ మార్కెట్లో పండగ ముందు టమాటాల ధరలు 8 నుంచి 10 రూపాయల వరకు ఉండటం రైతులను కొంత సంతోషపెట్టింది. కానీ పండగ ముగిసిన వెంటనే ధర ఒక్కసారిగా 4 రూపాయల వరకు పడిపోయింది. రైతులు తమ బాధని వ్యక్తపరిచారు.
రైతులు మార్కెట్‌కు తీసుకువచ్చిన టమాటాలను ప్రధాన రోడ్డు మీద ఉంచి ధరల సమస్యపై ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా పత్తికొండ-కర్నూలు ప్రధాన రహదారిపై వాహన రాకపోకలు నిలిచిపోయి. టమాటాకు కనీసకు మద్దతు ధర ఇవ్వాలని టమాటా పై పెట్టుబడిన పెట్టిన సొమ్ములో సగభాగం కూడా రాలేదని రైతులు వివరించారు.
రైతులు పండగ ముందు ధర 8–10 రూపాయల వరకు ఉండటం మాకు కొంత ఊరట ఇచ్చింది, కానీ ఇప్పుడు ఒక్కసారిగా 4 రూపాయల వరకు పడిపోయింది. కూలి ఖర్చు రవాణా ఖర్చు, మరియు శ్రమకు తగిన ఫలితం రాలేదు. పండగ తర్వాత ఈ ధరల క్షీణత రైతుల ఆర్థిక పరిస్థితిని మరింత కష్టతరంగా మార్చింది.
స్థానిక వ్యవసాయ అధికారులు సమస్యను గమనించి రైతులకు తగిన ధరను ఖాయం చేయడానికి త్వరిత పరిష్కారం తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. రైతులు ప్రభుత్వ సహకారంతో సరైన ధరల నియంత్రణ ద్వారా తమ పంటకు తగిన విలువ వచ్చేలా కోరుతున్నారు.