విజయ్ దేవరకొండ - రష్మిక మందన రహస్య ఎంగేజ్మెంట్? సినీ వర్గాల్లో మోగుతున్న టాక్!!

ఆఫీసులో ఉన్నా, ఇంట్లో పనుల్లో నిమగ్నమై ఉన్నా.. ఆకస్మాత్తుగా వచ్చే ప్రమోషనల్ కాల్స్ వల్ల కలిగే చిరాకు అంతా ఇంతా కాదు. “లోన్ కావాలా?”, “క్రెడిట్ కార్డు కావాలా?”, “కొత్త వెంచర్‌లో ఫ్లాట్ బుక్ చేయాలా?” అంటూ రోజంతా వచ్చే ఈ కాల్స్ వల్ల పని మధ్యలోనే మనసు చెదిరిపోతుంది. ఒక్కసారి కాదు, రోజులో అనేకసార్లు ఇలా ఫోన్లు మోగుతూనే ఉంటాయి. చాలామంది విసుగుతో ఆ కాల్స్ రిసీవ్ చేయకపోయినా, మరో నంబర్‌ నుంచి తిరిగి వస్తూనే ఉంటాయి. ఈ సమస్యను అధిగమించడానికి కొందరు ఆన్‌లైన్‌లో దొరికే యాప్‌లను ఉపయోగిస్తుంటారు. అయితే, ఈ యాప్‌లు నిజమైనవా కాదా అన్నది నిర్ధారించుకోకుండా డౌన్‌లోడ్‌ చేస్తే సైబర్‌ మోసాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు దొంగిలించబడే అవకాశం కూడా ఉంది.

Kushbu Comments: కరూర్ విషాదంపై కుట్ర కోణం! ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు

ఇలాంటి పరిస్థితుల్లోనే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) వినియోగదారుల కోసం ఒక సురక్షిత మార్గాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. స్పామ్‌ కాల్స్‌, అవాంఛిత మెసేజ్‌లను అడ్డుకోవడానికి “Do Not Disturb (DND)” అనే ప్రత్యేక ఫీచర్‌ను ట్రాయ్ ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. మొబైల్‌ ద్వారా 1909కి మెసేజ్ పంపడం లేదా కాల్‌ చేయడం ద్వారా ఈ సర్వీస్‌ను యాక్టివేట్ చేయవచ్చు. కానీ, దీని వల్ల అవసరమైన బ్యాంక్ లేదా సర్వీస్‌ కాల్స్ కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉండటంతో వినియోగదారులు కొంత వెనుకంజ వేస్తున్నారు.

రిషబ్ శెట్టి vs అల్లు అర్జున్ ...కాంతరకి ఎందుకు రాదు అంటూ నెటిజన్ల వ్యాఖ్యలు!!

ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని ట్రాయ్ మరో ముందడుగు వేసింది. ఇప్పుడు మొబైల్‌ వినియోగదారులు తమకు కావాల్సిన రకాల కాల్స్‌ను మాత్రమే బ్లాక్‌ చేసుకునేలా “DND App”ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా యూజర్లు తమ ఫోన్‌ నంబరుతో లాగిన్‌ అవ్వగానే డాష్‌బోర్డ్‌ కనిపిస్తుంది. అందులో ‘చేంజ్ ప్రిఫరెన్స్’ అనే ఆప్షన్ ఉంటుంది. దీని ద్వారా మీరు కోరనివి మాత్రమే బ్లాక్‌ చేయవచ్చు. ఉదాహరణకు — బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, క్రెడిట్‌ కార్డులు, రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్ వంటి విభాగాల్లోని ప్రమోషనల్ కాల్స్‌ రాకుండా చేయవచ్చు. ఈ విధంగా అవసరమైన కాల్స్‌ మాత్రం కొనసాగుతాయి.

Dmart: విజయదశమి ఫెస్టివ్ డీల్! DMartలో ఆ వస్తువులపై భారీ డిస్కౌంట్..!

ఇంకా ఒక ముఖ్యమైన ఫీచర్‌గా ట్రాయ్ “ఫ్రాడ్ కాల్స్” అనే ఆప్షన్‌ను కూడా అందించింది. దీని ద్వారా మోసపూరిత కాల్స్‌ లేదా స్కామ్‌ మెసేజ్‌లు వచ్చినప్పుడు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌, యాప్ స్టోర్‌ లేదా ఉమంగ్‌ ద్వారా ఈ యాప్‌ను సురక్షితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అనవసర కాల్స్‌ బారిన పడకుండా, సురక్షితంగా కమ్యూనికేషన్‌ కొనసాగించాలనుకునే వారికి ఈ DND యాప్‌ నిజంగా ఉపయుక్తం. మొబైల్‌ వినియోగదారుల ప్రైవసీని కాపాడటంలో ఇది ఒక పెద్ద ముందడుగుగా చెప్పుకోవచ్చు.

Mutton eat: వారానికి ఎంత మటన్ తినాలి.. వైద్యుల సలహాలు.. అతిగా మటన్ తింటే ఏమవుతుంది!
TVK: ట్రాజెడీ సృష్టించిన విపత్తు.. కరూర్ ర్యాలీపై నటి.. రాజకీయ నేత ఖుష్బూ వ్యాఖ్యలు!
ఏఐ ఆధారిత ఫార్మసీ విద్యలో రాబోయే అవకాశాలు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం అభివృద్ధి!!!
Minister Ponnam: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. మంత్రి పొన్నం పిలుపు
పిల్లల భద్రత విషయంలో నిర్లక్ష్యం... బాధ్యులపై కఠిన చర్యలు తప్పనిసరి – మంత్రి సంధ్యారాణి