LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Tamil Nadu Elections 2026: దళపతి విజయ్‌కు బీజేపీ రాయబారం.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ మారుతున్న సమీకరణాలు.!!

Tamil Nadu Elections 2026: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కాయి. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీని ఎన్డీయే కూటమిలోకి చేర్చుకునేందుకు బీజేపీ 80 సీట్లు, డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

AndhraPravasi News Desk 2 min read
Tamil Nadu Elections 2026: దళపతి విజయ్‌కు బీజేపీ రాయబారం.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ మారుతున్న సమీకరణాలు.!!

Tamil Nadu Elections 2026: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగకముందే ఆ రాష్ట్ర రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా అగ్ర నటుడు విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీ చుట్టూ ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. విజయ్ పార్టీని తమ కూటమిలోకి ఆహ్వానించేందుకు బీజేపీ అధిష్టానం భారీ ఆఫర్ ప్రకటించినట్లు జాతీయ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. దాదాపు 80 అసెంబ్లీ సీట్లతో పాటు, అధికారంలోకి వస్తే విజయ్‌కు ఏకంగా 'డిప్యూటీ సీఎం' పదవిని ఇచ్చేందుకు కమలదళం సిద్ధమైందని సమాచారం.

అయితే, ఈ ఆఫర్‌పై ఇప్పటివరకు ఇరు పార్టీల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం.ఈ పొత్తు వార్తలు ఊపందుకోవడానికి ప్రధాన కారణం విజయ్‌కు ఉన్న అశేష అభిమాన గణమే. తమిళనాడులోని మెజారిటీ నియోజకవర్గాల్లో విజయ్ అభిమానులు కనీసం 2 నుంచి 5 శాతం ఓట్లను ప్రభావితం చేయగలరని బీజేపీ అంచనా వేస్తోంది. డీఎంకే బలాన్ని ఢీకొట్టాలంటే విజయ్ వంటి ఛరిష్మా ఉన్న నాయకుడి అవసరం ఎన్డీయే కూటమికి ఎంతో ఉందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే ఒక పక్కా వ్యూహంతో విజయ్‌ను ప్రసన్నం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. 

ఇప్పటికే పొరుగు రాష్ట్రానికి చెందిన ఒక కీలక నేత ఈ రాయబారంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు పొలిటికల్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు, విజయ్ మాత్రం ఈ పొత్తుల వ్యవహారంపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తాము 'ద్రవిడ'  'జాతీయ' సిద్ధాంతాలకు అతీతంగా, ప్రజల పక్షాన నిలబడతామని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. డీఎంకే, బీజేపీలకు సమాన దూరం పాటిస్తామని ప్రకటించినప్పటికీ, ఎన్నికల వేళ సమీకరణాలు మారుతుంటాయన్నది జగమెరిగిన సత్యం. ప్రస్తుతం విజయ్‌కు ఉన్న సలహాదారులు మాత్రం బీజేపీతో పొత్తుకు అంతగా మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. మొదటి ఎన్నికల్లోనే జాతీయ పార్టీతో జతకడితే, టీవీకే యొక్క సొంత ఉనికి దెబ్బతినే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

తమిళనాడులో ప్రస్తుతం అధికార డీఎంకే బలంగా ఉంది. ఇలాంటి సమయంలో ఒంటరిగా పోరాడి ఓట్లు చీల్చడం కంటే, ఏదో ఒక బలమైన కూటమితో వెళ్లడం మేలని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే విజయ్ లక్ష్యం మాత్రం కేవలం డిప్యూటీ సీఎం పదవి కాదని, ఆయన నేరుగా ముఖ్యమంత్రి పీఠంపైనే కన్నేశారని పార్టీ వర్గాలు అంటున్నాయి. బీజేపీ ఇస్తామన్న 80 సీట్ల ప్రతిపాదన బాగున్నా, అధికారం పంచుకునే విషయంలో ఇంకా స్పష్టత రాకపోవడమే ఈ జాప్యానికి కారణమని విశ్లేషిస్తున్నారు. అటు విజయ్ ఢిల్లీ పర్యటనలు కూడా ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

 తమిళనాడు ఓటర్లు ఎప్పుడూ ఒక స్పష్టమైన తీర్పు ఇస్తుంటారు. సినిమా గ్లామర్ రాజకీయాల్లో రాణించాలంటే బలమైన క్షేత్రస్థాయి యంత్రాంగం అవసరం. విజయ్ తనకున్న క్రేజ్‌ను ఓట్లుగా మార్చుకోవాలంటే ఒక బలమైన మిత్రపక్షం తోడుండటం అవసరమే. కానీ, అది బీజేపీయే అవుతుందా? లేక విజయ్ తన సొంత ఇమేజ్‌తోనే అద్భుతం చేస్తారా? అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా, విజయ్ తీసుకునే ఒక చిన్న నిర్ణయం తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాతే ఈ పొత్తుల గందరగోళంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…