LIVE
World History: ప్రపంచంలోనే అరుదైన గుర్తింపు.. ఓ మహిళ పేరు మీదున్న ప్రపంచంలోని ఏకైక దేశం ఇదే! ఆ దేశం ఎక్కడుంది?  •  Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  • 
Politics

Nara Lokesh: 67 లక్షల మందికి రూ.8,454 కోట్ల మేర సాయం.. కూటమి ప్రభుత్వంలో 85శాతం మంది విద్యార్థులకు.!

Nara Lokesh Speech About Talliki Vandanam: తల్లికి వందనం పథకం కింద రాష్ట్రంలో 67,01,653 మంది విద్యార్థులకు రూ.8,454 కోట్ల మేర సాయం అందించాం. అర్హులందరికీ సాయం అందించాలనేది ప్రజా ప్రభుత్వ నిర్ణయమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

AndhraPravasi News Desk 1 min read
Nara Lokesh: 67 లక్షల మందికి రూ.8,454 కోట్ల మేర సాయం.. కూటమి ప్రభుత్వంలో 85శాతం మంది విద్యార్థులకు.!
  • వైసీపీ హయాంలో 52శాతం మంది విద్యార్థులకే సాయం..
     
  • అర్హులందరికీ సాయం అందించాలనేది ప్రజా ప్రభుత్వ నిర్ణయం..

Nara Lokesh Speech About Talliki Vandanam: తల్లికి వందనం పథకం కింద రాష్ట్రంలో 67,01,653 మంది విద్యార్థులకు రూ.8,454 కోట్ల మేర సాయం అందించాం. అర్హులందరికీ సాయం అందించాలనేది ప్రజా ప్రభుత్వ నిర్ణయమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం, యూడైస్ ప్రకారం రాష్ట్రంలో నమోదైన విద్యార్థుల సంఖ్యపై శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ.. యూడైస్ ప్రకారం ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు రాష్ట్రంలో 79,51,903 మంది విద్యార్థులు నమోదయ్యారు. తల్లికి వందనం పథకం కింద రూ.8,454 కోట్లు సాయం అందించాం. 67,01,653 మందికి తల్లికి వందనం వర్తించింది. యూడైస్ లో 86 లక్షల మంది విద్యార్థులు ఉన్నారంటూ వైసీపీ నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారు. యూడైస్ లో నమోదైన వారిలో అర్హులందరికీ(84.27%) సాయం అందించాం.  

వైసీపీ హయాంలో యూడైస్ కింద 81,72,224 మంది విద్యార్థులు నమోదై ఉంటే.. కేవలం 42,33,098 మందికి మాత్రమే, అంటే 52శాతం మందికి మాత్రమే ఇచ్చారు. మేం 85శాతం మందికి సాయం అందించాం. 2020-21 చూస్తే సుమారుగా 83 లక్షల మంది ఉంటే.. కేవలం 44 లక్షల మందికే ఇచ్చారు. 2021-22లో 82 లక్షల మంది ఉంటే.. కేవలం 43 లక్షల మందికే ఇచ్చారు. 2022-23లో 80 లక్షల మంది ఉంటే.. కేవలం 42 లక్షల మందికే ఇచ్చారు. వైసీపీ హయాంలో 52శాతం మంది విద్యార్థులకు ఇస్తే.. ప్రజా ప్రభుత్వంలో 84.27 శాతం మందికి అందజేశాం. తల్లికి వందనం పథకం కింద సాయం అందని వారి వివరాలు పంపిస్తే.. సరిచేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. అర్హులందరికీ సాయం అందించాలనేది ప్రజా ప్రభుత్వ నిర్ణయం.

కొంతమందికి పాక్షిక సాయం అందించారనే విషయంలో.. సోషల్ వెల్ఫేర్ విభాగంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. మేం ముందు చెల్లించిన తర్వాత కేంద్రం నిధులు అందజేస్తోంది. రెండూ కలిసికట్టుగా మేం అందిస్తున్నాం. గ్యాప్ ఏమైనా ఉంటే వివరాలు ఇవ్వాలి. పారిశుద్ధ్య కార్మికులందరికీ తల్లికి వందనం వర్తించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. 
 

Be the first to react

More Coverage

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!

ROB: ఈ ఆర్‌ఓబీ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించను…

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రస్థానం.. మదనపల్లి ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో రేపు భారీ బహిరంగ సభ!

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవ…