Samsung Galaxy: తక్కువ ధరకే టాప్ ఫీచర్లు..! లాంగ్ లైఫ్ అప్‌డేట్ సపోర్ట్‌తో కొత్త 5G స్మార్ట్‌ఫోన్..!

దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లలో విచారణ ఖైదీలకు ఓటు హక్కు ఇవ్వాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రస్తుతం దేశంలోని వివిధ జైళ్లలో సుమారు 4.5 లక్షల మంది విచారణ ఖైదీలు, ఇంకా శిక్ష ఖరారు కాని వ్యక్తులు ఉన్నారు. వీరికి ఓటు హక్కు ఇవ్వకపోవడమే ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పిటిషనర్లు వాదించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై స్పందించేందుకు కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.

GHMC Alert: ఓటర్ ఐడీ లేకున్నా ఓటు హక్కు గ్యారంటీ..! జీహెచ్ఎంసీ కీలక స్పష్టత..!

ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తరఫున దాఖలైన ఈ పిటిషన్‌లో ప్రజాప్రాతినిధ్య చట్టం (Representation of the People Act - RPA) 1951లోని సెక్షన్ 62(5)ని సవాలు చేశారు. ఈ నిబంధన ప్రకారం, జైల్లో ఉన్న ఎవరైనా ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హులు కారు. అయితే, ఈ నిషేధం రాజ్యాంగ హామీలైన సమానత్వ హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులకు విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం ఓటర్ల జాబితాలో పేరు ఉన్న ప్రతి పౌరుడికీ ఓటు వేసే హక్కు ఉందని, ఈ హక్కును కేవలం కొన్ని ప్రత్యేక కారణాల వల్లే — మతిస్థిమితం కోల్పోవడం, నివాసం లేకపోవడం లేదా ఎన్నికల నేరాలకు పాల్పడడం వంటి సందర్భాల్లో — పరిమితం చేయవచ్చని వాదించారు.

ఎయిరిండియా విమానానికి త్రుటిలో తప్పిన ముప్పు.. పదేపదే సాంకేతిక లోపాలు!

పిటిషన్‌లో జైళ్లలో ఉన్నవారి వాస్తవ పరిస్థితులను కూడా ప్రస్తావించారు. దేశంలోని జైళ్లలో ఉన్న ఖైదీలలో 75 శాతానికి పైగా విచారణ ఖైదీలే అని, వీరిలో ఎక్కువమంది చివరికి నిర్దోషులుగా తేలుతున్నారని తెలిపారు. అయినప్పటికీ, సంవత్సరాల తరబడి విచారణ సాగుతుండడంతో వారు తమ ఓటు హక్కును కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “నేరం నిరూపితంకాకుండా ఉన్న వ్యక్తులను ఖైదీలుగా పరిగణించి, ఓటు హక్కును దూరం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం” అని పేర్కొన్నారు.

Sourav Ganguly: రోహిత్ కెప్టెన్సీపై దాదా స్పందన.. ఇది తప్పు నిర్ణయం కాదు!

పిటిషనర్లు తమ వాదనలో పలు దేశాల ఉదాహరణలను చూపించారు. పాకిస్థాన్‌లో కూడా విచారణ ఖైదీలకు ఓటు వేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారత జైళ్లలో సుమారు 1,350 కేంద్రాల్లో పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం లేదా పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఈ హక్కును సులభంగా అమలు చేయవచ్చని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఒక ఖైదీకి ఉంటే, ఇంకా నేరం నిరూపితంకాని పౌరుడు అయిన విచారణ ఖైదీకి ఓటు వేయడం ఎందుకు నిరాకరించాలన్న ప్రశ్నను సుప్రీంకోర్టు ముందుకు తీసుకువచ్చారు. ఈ అంశంపై కేంద్రం మరియు ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వాల్సి ఉంది.

Twin Banana: జంట అరటి పండ్లు తింటే కవలలు పుడతారా.. ఇది నిజమేనా?
CP Sajjanar: ట్రాన్స్ జెండర్ల వేధింపులపై ట్వీట్.. వెంటనే స్పందించిన సీపీ సజ్జనార్!
Gold Loan: జాగ్రత్త.. గోల్డ్ లోన్ రూల్స్ మార్పు.! సామాన్యులకు షాక్ - ప్రతినెలా వడ్డీ చెల్లించాల్సిందే!
భార్య ఎందుకు ఉపవాసం చేస్తుంది...కర్వా చౌత్ రహస్యమేంటి ?
Gold prices: బంగారం ధరలు పతనం.. వినియోగదారులకు గోల్డెన్ ఛాన్స్!
రిషికొండ ప్యాలెస్ వినియోగంపై మంత్రివర్గం కీలక చర్చలు... త్వరలో ప్రకటనలు ఇవ్వనున్న ప్రభుత్వం!!