Pakisthan: పాకిస్థాన్‌లో మళ్లీ రైలు దాడి..! జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై ఉగ్రవాదుల కొత్త కుట్ర..!

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి రూ.60 కోట్ల మోసం కేసులో చిక్కుకోవడంతో మరోసారి చర్చకు కేంద్రబిందువుగా మారారు. ఈ కేసులో భాగంగా ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) అధికారులు ఆమెను సుదీర్ఘంగా విచారించారు. శిల్పా నివాసానికి వెళ్లిన అధికార బృందం దాదాపు నాలుగున్నర గంటల పాటు ఆమెను ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేసింది. విచారణలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పలు కీలక ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఈ విచారణపై బాలీవుడ్ వర్గాల్లో, సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.

Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! రైల్వేలో 8 వేలకుపైగా ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్..!

ఈ కేసు వ్యాపారవేత్త దీపక్ కొఠారి ఫిర్యాదు ఆధారంగా కొనసాగుతోంది. ఆయన తన ఫిర్యాదులో, 2015 నుంచి 2023 మధ్య కాలంలో వ్యాపార విస్తరణ పేరుతో శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా తన వద్ద నుంచి రూ.60 కోట్లకు పైగా తీసుకున్నారని పేర్కొన్నారు. ఆ డబ్బును వ్యాపార పెట్టుబడుల కోసం కాకుండా వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని ఆరోపించారు. ఈ మొత్తం తిరిగి ఇవ్వకపోవడంతో తాను మోసపోయానని కొఠారి తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Industrial Park: ఏపీలో కొత్తగా మూడు ఇండస్ట్రియల్ పార్క్‌లు! రూ.7,949.48 కోట్లతో.. ఆ మూడు జిల్లాలకు మహర్దశ

విచారణ సందర్భంగా, శిల్పా శెట్టి తన అడ్వర్టైజింగ్ కంపెనీ బ్యాంక్ లావాదేవీల వివరాలను అధికారులకు అందజేశారు. ఆమె అందించిన పత్రాల్లో పలు పెద్ద మొత్తాల ట్రాన్స్‌ఫర్లు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఆ పత్రాలను పరిశీలిస్తూ ఆర్థిక ప్రవాహాల వెనుక ఉన్న లింకులను అన్వేషిస్తున్నారు. విచారణలో శిల్పా పూర్తిగా సహకరించారని అధికారులు తెలిపారు. ఆమె భర్త రాజ్ కుంద్రాను ఇప్పటికే సెప్టెంబర్ నెలలోనే విచారించినట్లు, అవసరమైతే మళ్లీ పిలుస్తామని పోలీసులు పేర్కొన్నారు.

SSMB29: SSMB29లో మహేశ్ బాబుతో ప్రియాంక చోప్రా మాస్ డాన్స్.. రాజమౌళి కొత్త సర్ప్రైజ్!

ఈ కేసులో మరో ఆసక్తికర అంశం బయటకు వచ్చింది. కంపెనీ ఖాతాల నుంచి శిల్పా శెట్టి, బిపాసా బసు, నేహా ధూపియా వంటి నటీమణుల వ్యక్తిగత ఖాతాలకు నిధులు బదిలీ అయినట్లు గుర్తించినట్లు సమాచారం. అదేవిధంగా బాలాజీ ఎంటర్టైన్మెంట్ సంస్థకు కూడా పెద్ద మొత్తంలో ఫండ్‌లు ట్రాన్స్‌ఫర్ అయినట్లు విచారణలో తేలింది. రాజ్ కుంద్రా తన వాంగ్మూలంలో ఆ నిధుల కొంత భాగం నటీమణుల ఫీజుల రూపంలో చెల్లించామని పేర్కొన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ లావాదేవీలన్నింటినీ పోలీసులు క్రాస్ చెక్ చేస్తుండగా, కేసు విచారణ మరింత ముమ్మరంగా సాగుతోంది.

ఆ రూమర్స్ కి చెక్ పెట్టిన సమంత... ఆనందంలో అభిమానులు!!
ఆసియా కప్ 2025 వివాదం సూర్యకుమార్ యాదవ్ వస్తేనే ట్రోఫీ ఇస్తాం అంటున్న పాకిస్తాన్ వైఖరి!!
Ram Charan Family: క్లీన్‌కారా ముఖం ఎందుకు చూపించడం లేదో ఎట్టకేలకు వెల్లడించిన ఉపాసన..! అభిమానులకు షాక్..!
CRDA: అమరావతిలో పర్యటించిన ఆసియా అభివృద్ధి బ్యాంకు బృందం.. CRDA కార్యాలయంలో!
దుబాయ్ ఎయిర్‌పోర్ట్ మూసివేతకు ఆఫ్రికా దేశం రాజు కారణం! ఎందుకంటే!
Election Commission: భారత ఎన్నికల కమిషన్ నూతన ఆవిష్కరణ.. ECINet సింగిల్ విండో ప్లాట్‌ఫారమ్‌!