CRDA: అమరావతిలో పర్యటించిన ఆసియా అభివృద్ధి బ్యాంకు బృందం.. CRDA కార్యాలయంలో!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల గారాలపట్టి క్లీన్‌కారాను చూడాలని మెగా అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. పాప పుట్టినప్పటి నుంచి ఆమె ముఖాన్ని బయట ప్రపంచానికి చూపించకపోవడంతో, దీనిపై అభిమానుల్లో ఆసక్తి, ఊహాగానాలు పెరిగిపోయాయి. క్లీన్‌కారా పుట్టినప్పటి నుంచి ఉపాసన సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకున్నప్పటికీ, ప్రతి ఫోటోలోనూ పాప ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. మొదటి పుట్టినరోజు సందర్భంగా అయినా క్లీన్‌కారా ముఖం బయటకు వస్తుందేమోనని అభిమానులు ఎదురుచూశారు, కానీ ఆ ఆశ నెరవేరలేదు. ఈ నేపథ్యంలో ఉపాసన తాజాగా ఒక కార్యక్రమంలో తమ నిర్ణయానికి గల అసలు కారణాన్ని వెల్లడించారు.

దుబాయ్ ఎయిర్‌పోర్ట్ మూసివేతకు ఆఫ్రికా దేశం రాజు కారణం! ఎందుకంటే!

ఈ విషయంపై ఉపాసన మాట్లాడుతూ, “ప్రపంచం చాలా వేగంగా మారిపోతోంది. ఏం జరుగుతుందో ఎవరికీ ముందుగా తెలియడం లేదు. కొన్ని సంఘటనలు నన్ను, చరణ్‌ను చాలా భయపెట్టాయి. అందుకే మా పాపకు స్వేచ్ఛ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం” అని తెలిపారు. తల్లిదండ్రులుగా పిల్లల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని, ఎయిర్‌పోర్టులో కూడా పాప ముఖానికి మాస్క్ వేయడం తమకు సులభం కాకపోయినా అవసరమని భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Election Commission: భారత ఎన్నికల కమిషన్ నూతన ఆవిష్కరణ.. ECINet సింగిల్ విండో ప్లాట్‌ఫారమ్‌!

“మేము చేస్తున్నది సరైనదా కాదా అనేది మాకు స్పష్టంగా తెలియదు. కానీ ఈ నిర్ణయం పట్ల మేము సంతోషంగా ఉన్నాం. ఇప్పట్లో క్లీన్‌కారా ముఖాన్ని చూపించే ఆలోచన లేదు” అని ఉపాసన తెలిపారు. ఈ వ్యాఖ్యలతో ఉపాసన, రామ్ చరణ్ దంపతులు తమ నిర్ణయంపై ఎంత స్థిరంగా ఉన్నారో స్పష్టమవుతోంది. పిల్లల గోప్యతను కాపాడడమే కాకుండా, ఆమె వ్యక్తిగత జీవితం మీడియా దృష్టికి దూరంగా ఉంచాలని వారు కోరుకుంటున్నారు.

Praja Vedika: నేడు (07/10) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

రామ్ చరణ్–ఉపాసనల వివాహం 2012లో జరిగింది. 11 ఏళ్ల తర్వాత, 2023 జూన్ 20న క్లీన్‌కారా జన్మించింది. పాప పుట్టినప్పటి నుంచి దంపతులు ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నా, క్లీన్‌కారా ముఖాన్ని మాత్రం బయటకు చూపించలేదు. మెగా అభిమానులు పాపను చూడాలనే ఆశతో ఎదురు చూస్తున్నా, ఉపాసన తాజా వ్యాఖ్యలతో ఆ నిరీక్షణకు తాత్కాలికంగా తెరపడినట్లయింది. అయితే అభిమానులు మాత్రం “ఎప్పుడు అయినా ఒకరోజు క్లీన్‌కారాను చూడగలమన్న నమ్మకం ఉంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

MSME: ఏపీ చాంబర్స్‌ సీఎంకు లేఖ..! పెండింగ్‌ ప్రోత్సాహకాలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి..!
LIC Bima Sakhi Yojana: ఎల్ఐసీ భీమా సఖీ యోజనలో చేరండి! ప్రతి మహిళ వేళల్లో లబ్ధి పొందండి!
అమెరికాకు ఎగుమతయ్యే ట్రక్కుల పై.. ట్రంప్ టారిఫ్ అమలు!!
Employment Opportunities: కేంద్ర మంత్రి తీపికబురు! ఏపీలో అక్కడ 5లక్షల ఉద్యోగాలు..
IRCTC Tourism: రూ.20 వేలకే దేశ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల దర్శనం! భారత్ గౌరవ్ రైలు ఏపీలో ఆగే స్టేషన్లు ఇవే!
Visa: అమెరికా గ్రీన్‌కార్డ్‌కి గోల్డెన్ ఛాన్స్..! ఇ వీసాతో శాశ్వత నివాసం సులభం.. వివరాలు మీ కోసం..!