సమంత అందరికీ సుపరిచితమే అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకునేలా తన హావ భావాలను తెరపై చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది ఈ భామ. ఏం మాయ చేసావే చిత్రంతో సినీ పరిశ్రమంలోకి అడుగుపెట్టి అక్కడ నుంచి వరుస విజయాలతో పరంపరం కొనసాగించి సౌత్ ఇండియాలోని స్టార్ హీరోయిన్ గా పేరుగాంచారు.
మనం చిత్రంతో అక్కినేని నాగచైతన్యతో ప్రేమాయణం కొనసాగించి ఇరువురు ప్రేమ వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే ఈ జంటను చూసి టాలీవుడ్ లో క్యూట్ జోడి అని సోషల్ మీడియాలోనే వైరల్ గా మారారు. అయితే అంతలోనే ఏమైందో ఏమో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. వెలువడ్డ రెండు నెలల విడాకులు తీసుకున్న విషయం కూడా అందరికీ తెలిసినదే. ఆ తర్వాత సమంత మయసైటీస్ వ్యాధి నుంచి కోలుకున్న సమంత వరుస సినిమాలను లైన్లో పెడుతోంది అని అనుకున్నారు అభిమానులు.
సమంత తన రెండో సినిమాను కూడా నిర్మిస్తున్నారట. ఈ సినిమా పేరు మా ఇంటి బంగారం. ఈ సినిమాలో సమంత కీ పాత్రలో నటిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. కానీ సమంత తాజాగా ఈ పుకార్లను పుల్ స్టాప్ పెట్టారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం ఈ నెలలోనే మా ఇంటి బంగారం సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
సమంత మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉంది.ఇంతకాలం తర్వాత మిమ్మల్ని అలరించేందుకు ఒక కొత్త కాన్సెప్ట్ తో గుర్తుండిపోయారా అద్భుతమైన చిత్రాన్ని తీసుకొస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ మాటలు వినగానే సమంత అభిమానులకు ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవాలి.అయితే సమంత ప్రస్తుతం డైటింగ్ లో ఉన్నారని అది కూడా ఫ్యామిలీ మాన్ డైరెక్టర్ తో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కెరలు కొడుతున్నాయి అయితే ఈ రూమర్స్ కూడా సమంత ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.