ఎస్వాతినీ పూర్వం స్వాజిలాండ్‌గా ప్రసిద్ధి చెందిన చిన్న ఆఫ్రికా దేశం సుమారు 1.1 మిలియన్ ప్రజలతో రాజుల పరిపాల లోనే కొనసాగుతుంది. ఆఫ్రికాలో ఇది ఒక పేద దేశంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రజలు వ్యవసాయం, చక్కెర, వస్త్ర పరిశ్రమ మీద మాత్రమే ఆధారపడి జీవిస్తారు. నేటికీ కూడా ఇక్కడ అధిక పేదరికం, పరిమిత ఆరోగ్య, విద్య సదుపాయాలు, HIV/AIDS వంటి సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
ఇప్పటికీ ఈ దేశం రాజుల పరిపాలనలోనే ఉంది. మూడవ మస్వాతి దేశాన్ని పాలిస్తున్నారు. మస్వాతి దేశ అభివృద్ధిపై కాకుండా, ఎక్కువగా జల్సాల గురించి ఆలోచిస్తున్నారని దేశ ప్రజల ఆరోగ్యం పట్ల ఎటువంటి పథకాలు కానీ నిర్ణయాలు కానీ తీసుకోకుండా విదేశాల్లో విలాసవంతంగా గడుపుతున్నారు అనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మస్వాతికి సంబంధించిన ఒక పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో కొన్ని నెలల క్రితం మస్వాతి తన కుటుంబంతో దుబాయ్ వెళ్లారు తన వెంట 15 భార్యలను, 30 పిల్లలను కూడా తీసుకెళ్లారు. దుబాయ్‌లో తమకు సేవల కోసం 100 మంది సిబ్బందిని కూడా తీసుకెళ్లారు. రాజ కుటుంబం కావడంతో దుబాయ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు.
మస్వాతి కుటుంబం కోసం ఎయిర్‌పోర్టులో కొన్ని టెర్మినళ్లను మూసివేయాల్సి వచ్చింది దుబాయ్ ప్రభుత్వానికి. అయితే ఈ పర్యటన అనేది దేశ సంరక్షణ కోసం అయితే బాగుండేదని కాకపోతే వాళ్ళ యొక్క స్వార్థం కోసం ఎయిర్ పోర్ట్ లో కూడా టెర్మినళ్లను మూసి వేయడం అనేది అక్కడ ప్రయాణికులకు ఇబ్బందికరంగానే ఉంటుందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
మరికొంతమంది జల్సాల కోసం ప్రజల డబ్బును ఖర్చు చేస్తున్నావు ఇది సరైన పద్దతి కాదు అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మస్వాతి తండ్రికి 125 భార్యలు ఉండేవారని ఈయనకి ఇంకా తక్కువేనని కామెంట్ చేస్తున్నారు. ఒక్క భార్యతోనే బాధ పడుతున్నాం. నువ్వు 15 భార్యలను ఎలా జీవిస్తున్నావురా అంటూ చిలిపిగా కామెంట్లు చేయడం జరుగుతుంది..