అమెరికాలో మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రన్ వే పై ల్యాండయ్యే క్రమంలో ఓ ప్రైవేట్ జెట్ అదుపుతప్పింది. పార్కింగ్ ప్లేసులో ఉన్న మరో ప్రైవేట్ జెట్ ను ఢీ కొట్టింది. దీంతో ఓ ప్రయాణికుడు చనిపోగా మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. అరిజోనా రాష్ట్రంలోని స్కాట్స్ డేల్ ఎయిర్ పోర్ట్ లో సోమవారం మధ్యాహ్నం 2:45 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వివరాల ప్రకారం.. లియర్‌జెట్ 35ఏ విమానం ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయింది. రన్‌వే దాటి ర్యాంప్‌పై ఉన్న గల్ఫ్‌స్ట్రీమ్ 200 బిజినెస్ జెట్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం నేపథ్యంలో అధికారులు స్కాట్స్ డేల్ ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. రన్ వేను క్లియర్ చేసి, విమానాల రాకపోకలకు సిద్ధం చేసేందుకు చర్యలు చేపట్టారు.

ఇది కూడా చదవండి: హెచ్ 1బీ వీసాలపై అమెరికా అలర్ట్! మార్చి 7న ప్రారంభం!

ప్రమాదానికి కారణమైన లియర్ జెట్ విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే విషయం ఇంకా తెలియరాలేదు. ఇటీవల అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గడిచిన రెండు వారాల్లో నాలుగు ప్రమాదాలు జరిగాయి. జనవరి 29న వాషింగ్టన్ సమీపంలో ఓ విమానం, ఆర్మీ హెలికాప్టర్ ఢీకొట్టడంతో 67 మంది చనిపోయారు. రెండు రోజుల తర్వాత (జనవరి 31న) ఫిలడెల్ఫియాలో ఓ రవాణా విమానం కూలిపోయి ఆరుగురు మరణించారు. ఫిబ్రవరి 9న అలాస్కాలో చిన్న విమానం ఒకటి సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా విమానంలోని పదిమంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జరిగిన ప్రమాదంతో గత రెండు వారాల్లో నాలుగు ప్రమాదాలు జరగగా మొత్తం 85 మంది చనిపోయారు.

ఇది కూడా చదవండి: ప్రజలకు కీలక అప్డేట్.. ఏపీలో మీకు భూమి ఉందా.! వెంటనే ఇలా చెయ్యండి, లేదంటే.. రద్దవ్వగలదు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టాలీవుడ్ లో హల్ చల్.. ప్లీజ్ ఇక వదిలేయండి.. రామ్ చరణ్ ను నేను ఉద్దేశపూర్వకంగా ఏమీ అనలేదు!

జగన్ కి షాక్.. 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే.. అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు!

షాకింగ్ న్యూస్.. ట్రంప్ బాటలో UK ప్రధాని.. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం! 600 మందికి పైగా.. భారతీయ విద్యార్థులకు నిరాశ తప్పదా?

అసలు వీడు మనిషేనా.. రేషన్ కార్డు కావాలంటే నీ కూతుర్ని నా దగ్గరకు పంపు.. ఆ జిల్లాలో కామ కీచకుడు!

విద్యార్థులకు తీపి కబురు అందించిన సీఎం! వారందరికీ ఉపకార వేతనాలు! ఒక్కొక్కరికి ఎంత అంటే!

పేటీఎం యాప్ ఉసెర్స్ కి గుడ్ న్యూస్.. మ‌రో కొత్త స‌ర్వీస్‌ ప్రారంభం! భార‌త్ తో స‌హా ఇత‌ర దేశాల్లోని..

ఏపీ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త.. ఆ ఇళ్లన్నీ వారికే! ఈ పని త్వరగా చేయాలి.. మంత్రి కీలక అప్డేట్!

ఏపీ మంత్రి మానవత్వం.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతికి స్వయంగా..

ఓరి దేవుడా.. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్! 300 కి.మీ. మేర నిలిచిన వాహనాలు! అది ఎక్కడో తెలుసా?

పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం! నలుగురి మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు!

వైఎస్సార్ జిల్లాలో భూకబ్జాల కలకలం.. వైకాపా నేతలపై కేసులు నమోదు! కోట్లాది విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ!

ట్రాన్స్ జెండర్ ని ప్రేమించాడు.. తండ్రి సమాధి వద్దే.. చివరికి అతనికి జరిగింది ఇదే!

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం! ఆ తీర్మానాన్ని రద్దు చేస్తూ..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group