పల్నాడు జిల్లా ముప్పాళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు మృతి చెందడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమని సీఎం అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు. ముప్పాళ్ల మండలం బొల్లవరం పరిధిలోని మాదల మేజర్ కాలువ కట్టపై ఆదివారం సాయంత్రం కూలీలతో వస్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో నలుగురు మహిళా వ్యవసాయ కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన మహిళా కూలీలు మిరపకోతలకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మధిర సామ్రాజ్యం (50), మధిర గంగమ్మ (55), చక్కెర మాధవి (30), తేనెపల్లి పద్మావతి (45) మృతి చెందారు. క్షతగాత్రులు సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం! ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ట్రాన్స్ జెండర్ ని ప్రేమించాడు.. తండ్రి సమాధి వద్దే.. చివరికి అతనికి జరిగింది ఇదే!
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం! ఆ తీర్మానాన్ని రద్దు చేస్తూ..
వందేభారత్ ప్రయాణికులకు కొత్త సదుపాయం! పూర్తి వివరాలు ఇవే!
చంద్రబాబు భారీ శుభవార్త.. కీలక ప్రకటన, ఈ నెల 12 వ తేదీ వరకూ! వెంటనే అప్లై చేసుకోండి!
జైల్లోకెళ్లి దస్తగిరికి బెదిరింపులు - విచారణకు ఆదేశించిన ప్రభుత్వం! జగన్ గెట్ రెడీ..
ఉగాది నుంచి ఏపీలో పీ4 విధానం అమలు! ఈ సలహాలు, సూచనలు ఆధారంగానే..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: