టాలీవుడ్ సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ మీడియా ముందుకు వచ్చారు. ఓ ఈవెంట్ లో తాను రామ్ చరణ్ స్థాయి తగ్గించేలా మాట్లాడానని తనను ట్రోల్ చేస్తున్నారని తెలిపారు. రామ్ చరణ్ ను ఉద్దేశపూర్వకంగా తాను ఏమీ అనలేదని స్పష్టం చేశారు. దిల్ రాజు పరిస్థితిని వివరించే క్రమంలో తాను మాట్లాడిన మాటలు మరోలా అర్థం చేసుకున్నారని అల్లు అరవింద్ వివరణ ఇచ్చారు. "రామ్ చరణ్ స్థాయిని తగ్గించేలా మాట్లాడానంటూ నన్ను ట్రోల్ చేస్తున్నారు... ఇది మీ అందరికీ తెలుసు. ఇదే అంశంపై ఇటీవల ఓ సీనియర్ జర్నలిస్టు ప్రశ్నిస్తే... ఇప్పుడు తగిన సమయం కాదు, తర్వాత మాట్లాడతాను అని చెప్పాను.
ఇది కూడా చదవండి: జగన్ కి షాక్.. 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే.. అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు!
ఇవాళ పబ్లిక్ కు నేను చెప్పాలనుకుంటుంది ఏమిటంటే... ఆ రోజు దిల్ రాజును వేదికపై ఆహ్వానిస్తూ... ఆయన వారం రోజులుగా ఇన్ కమ్ ట్యాక్సు వ్యవహారాలు, కష్టాలు, నష్టాలు అనుభవించారు అని పరిచయం చేయడానికి యథాలాపంగా ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. అవి ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కాదు. దానికి మెగా అభిమానులు చాలా ఫీలయ్యారు... నన్ను ట్రోల్ చేశారు. చరణ్ నా కొడుకులాంటివాడు... నాకున్న ఏకైక మేనల్లుడు.... అతడికున్న ఏకైక మేనమామని.... అందుకే ఎంతో భావోద్వేగంతో చెబుతున్నాను... ప్లీజ్, ఇక ఆ విషయం వదిలేయండి. చరణ్, నాకు మధ్య ఒక అద్భుతమైన అనుబంధం ఉంది. ఆ రోజున దిల్ రాజు లైఫ్ గురించి చెప్పడానికి పొరపాటున అలా మాట్లాడాల్సి వచ్చింది... తర్వాత అలా మాట్లాడకుండా ఉంటే బాగుండు అనిపించింది" అంటూ అల్లు అరవింద్ వివరణ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: ప్రజలకు కీలక అప్డేట్.. ఏపీలో మీకు భూమి ఉందా.! వెంటనే ఇలా చెయ్యండి, లేదంటే.. రద్దవ్వగలదు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అసలు వీడు మనిషేనా.. రేషన్ కార్డు కావాలంటే నీ కూతుర్ని నా దగ్గరకు పంపు.. ఆ జిల్లాలో కామ కీచకుడు!
విద్యార్థులకు తీపి కబురు అందించిన సీఎం! వారందరికీ ఉపకార వేతనాలు! ఒక్కొక్కరికి ఎంత అంటే!
పేటీఎం యాప్ ఉసెర్స్ కి గుడ్ న్యూస్.. మరో కొత్త సర్వీస్ ప్రారంభం! భారత్ తో సహా ఇతర దేశాల్లోని..
ఏపీ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త.. ఆ ఇళ్లన్నీ వారికే! ఈ పని త్వరగా చేయాలి.. మంత్రి కీలక అప్డేట్!
ఏపీ మంత్రి మానవత్వం.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతికి స్వయంగా..
ఓరి దేవుడా.. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్! 300 కి.మీ. మేర నిలిచిన వాహనాలు! అది ఎక్కడో తెలుసా?
పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం! నలుగురి మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు!
ట్రాన్స్ జెండర్ ని ప్రేమించాడు.. తండ్రి సమాధి వద్దే.. చివరికి అతనికి జరిగింది ఇదే!
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం! ఆ తీర్మానాన్ని రద్దు చేస్తూ..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: