ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుండి విశేష అవకాశాలు లభించనున్నాయి. PMEGP ద్వారా యువత తమ స్వంతంగా వ్యాపారాలు ప్రారంభించి, జీవితంలో ముందడుగు వేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం కింద స్వయం ఉపాధికి అర్హులైన వారికి రాయితీలతో కూడిన రుణాలను అందించనున్నారు.
ఇప్పటివరకు మహిళలు, దివ్యాంగులు, బీసీ, మైనారిటీ వర్గాలవారికి కూడా ఈ పథకం వర్తించేది. కానీ 2025-26 ఆర్థిక సంవత్సరం నుండి కేవలం ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు మాత్రమే ఈ అవకాశం వర్తించనుంది. కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం, ఈ పథకాన్ని మరింత లక్ష్యబద్ధంగా అమలు చేయాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునేవారికి యూనిట్ వ్యయంలో 35 శాతం వరకు, పట్టణాల్లో 25 శాతం వరకు రాయితీని అందించనున్నారు.
ఈ పథకం కింద manufacturing రంగాల్లో పరిశ్రమలు నెలకొల్పాలనుకునేవారికి గరిష్ఠంగా రూ.50 లక్షల వరకు రుణం అందించనున్నారు. అలాగే సేవల రంగంలో పరిశ్రమల కోసం రూ.20 లక్షల వరకు రుణం లభిస్తుంది. 18 ఏళ్లు నిండిన యువత ఈ పథకానికి అర్హులు. గరిష్ఠ వయోపరిమితి లేదు. తమకంటూ ఒక పరిశ్రమ ప్రారంభించి ఇతరులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఉన్న యువతకు ఇది ఓ చక్కని అవకాశం.
ఈ పథకాన్ని ఉపయోగించుకుని డెయిరీ ఫామ్‌లు, పంటల సాగు, గొర్రెల పెంపకం, టిష్యూ పేపర్ల తయారీ వంటి అనేక పరిశ్రమలను ప్రారంభించవచ్చు. ప్రభుత్వం అందించే రాయితీలతో యువత సులభంగా యూనిట్‌లు నెలకొల్పే అవకాశముంది. అర్హులైన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకుని తమ జీవితాల్లో మార్పు తెచ్చుకోవచ్చు.