నవరాత్రి సందర్భంగా గుజరాత్ లో గర్బా ఉత్సవాలు జరుగుతాయి అనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఈసారి కొన్ని ప్రదేశాల్లో గర్బా కార్యక్రమాలు అసభ్యతకు వేదిక అయ్యాయని సోషల్ మీడియాలో రీళ్లు, వీడియోలు ద్వారా తెలుస్తూనే ఉన్నాయి అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గర్బా అనేది గుజరాత్‌లో పుట్టిన సంప్రదాయ నృత్యం. దీని ఉద్దేశం కేవలం వినోదం మాత్రమే కాదు, ఆచారాలు, భక్తి, ఐక్యతకు ప్రతీక. పండుగ సమయంలో గర్బా డ్యాన్స్ చేస్తూ ప్రజలు ఒకచోట చేరి అందరూ కలిసి ఆడిపాడుతూ పండుగ వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. కానీ ఇటీవలి కాలంలో గర్బా ఉత్సవాల్లో దుస్తుల విషయంలో వివాదం ఎక్కువగా కనిపిస్తోంది.
దుస్తులు వ్యక్తిగత స్వేచ్ఛ అయినా పండుగ స్ఫూర్తిని గౌరవించడం కూడా ముఖ్యమని పెద్దలు సూచిస్తున్నారు.
కొంతమంది మాత్రం గర్బా ఉత్సవాలను ఫ్యాషన్ షోలు, పార్టీ వేదికలుగా మార్చడం సరికాదని, ఈ సందర్భాలు దుర్గా మాత భక్తిని ప్రదర్శించడానికి ఉపయోగపడాలని అంటున్నారు. పండుగ పవిత్రతను కాపాడే విధంగా సంప్రదాయ దుస్తులు ధరించడం మంచిదని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరికొందరు ఈ వాదన తప్పు అంటూ భారతదేశం వైవిధ్యం, స్వేచ్ఛలతో నిలుస్తుందని, దుస్తులు ఎంచుకోవడంలో కూడా ఆ స్వేచ్ఛ ఉండాలని వారు వాదిస్తున్నారు. పండుగల్లో ప్రతి ఒక్కరు తాము ఇష్టపడిన విధంగా వ్యక్తీకరించుకోవడం తప్పు కాదని, కానీ ఇతరులను వారి దుస్తుల కోసం తీర్పు ఇవ్వడం అనవసరమని నెటిజన్లు అంటున్నారు.
ఇక మొత్తానికి, నవరాత్రి గర్బా ఉత్సవాలు ప్రజలు తమ కుటుంబాలతో ఆనందంగా పాల్గొంటున్నారు. ఏదేమైనా మన సంస్కృతిని గౌరవిస్తూ భక్తితో ఆ మాతా దేవిని స్మరించుకుంట ఆనందంగా జరుపుకోవడం అందరికీ మంచిదనే మరి మరికొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచుకుంటున్నారు..