మన పూర్వికుల రోజువారీ జీవితం ప్రకృతితో మిళితమై ఉండేది. ఉదయం లేవగానే పక్షుల కుతలతో వాటి కిలకిలా రాగాలతో వాళ్ళ ఉదయాన్ని ప్రారంభించే వారు . కాలానుగుణంగా మనుషుల స్వార్థం పెరగడం వలన అధిక టెక్నాలజీ రేడియేషన్ ప్రభావం పక్షులు అంతరించిపోతున్నాయని శాస్త్రవేత్తలు తెలుపుతున్న విషయం అందరికీ తెలిసిందే.. ఒకప్పుడు ఎక్కడ చూసినా పిచ్చుకలు కనిపించేవి. కానీ మొబైల్ టవర్ల రేడియేషన్
అధికం అవ్వడంతో అది కూడా అంతరించిపోతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుత కాలంలో మొబైల్ అధికంగా ఉపయోగించడం ద్వారా పక్షజాతికి ప్రమాదం తలెత్తే సమస్యలు అధికమవుతున్నాయని అందులో భాగమైనది కలివికోడి.
ఇక అంతరించిపోతున్న అరుదైన పక్షుల్లో కలివికోడి ఒకటి. ఈ పక్షిని మొదటిసారి 1848లో పెన్నా నది పరిసరాల్లో చూశారు. తర్వాత 1985లో అది మళ్లీ కనబడింది. కానీ 1998 వరకు దీని జాడ కనిపించలేదు అంట . 2002లో ముంబై నేచురల్ హిస్టరీ సొసైటీ దీనికి సంబంధించిన కూత, పాదముద్రలు కనుగొన్నా, పక్షిని మాత్రం చూడలేక పోయిందని తెలిపారు .
అయితే వైఎస్సార్ కడప జిల్లా కొండూరు దగ్గర చిట్టడవుల్లో కలివికోడి ఉంటుందని సమాచారం రావడంతో అక్కడే 3 వేల ఎకరాల అభయారణ్యం ఏర్పాటు చేశారు. ఈ పక్షిని కనుగొనడానికి ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి దాదాపు రూ.50 కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు.
తాజాగా పరిశోధకులు కలివికోడి కూతను రికార్డ్ చేశారు. ఈ పక్షి పొడవు సుమారు 27 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. అయితే ఇది ఎగరదు. ఎక్కువగా ముళ్ల పొదల్లోనే తిరుగుతూ అక్కడే జీవనం సాగిస్తుంది. దీని కూత 200 మీటర్ల దూరం వరకు వినిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాబట్టి దీని ఉనికి గురించి తెలిసేది కూత ద్వారానే
కలివికోడి వంటి అరుదైన పక్షులను కాపాడటం మన అందరి బాధ్యత. పక్షులు, జంతువులు అంతరించిపోతే మన ప్రకృతి సమతుల్యం దెబ్బతింటుంది. ఒకప్పుడు మన పూర్వికులు ప్రకృతితో కలిసి జీవించేవారు. కానీ ఇప్పుడు మనం వాటిని కోల్పోతున్నాం. కనుక ఈ తరహా పక్షులను కాపాడుకోవడం, వాటి జీవనానికి సహకరించడం చాలా అవసరం. ఇదే మన భవిష్యత్తు తరాలకు ఇవ్వగలిగే గొప్ప బహుమతి.