అమెరికాలోని బర్మింగ్‌హామ్ నగరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కెల్లామ్ స్ట్రీట్‌లోని అపార్ట్‌మెంట్‌లో సంభవించిన ఈ ప్రమాదం నుంచి పది మంది తెలుగు విద్యార్థులు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. శనివారం సాయంత్రం 6:20 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో ఊపిరాడక విద్యార్థులు భయంతో కేకలు వేశారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చి, అపార్ట్‌మెంట్‌లో చిక్కుకున్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: సముద్రపు రొయ్యలపై అమెరికా ‘ట్యాక్స్’ పంజా.. ఏపీ రైతులకు షాక్! ధరలు మాత్రం..!
మిగిలిన విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారందరూ ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు. బాధితులంతా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు. వీరంతా అలబామా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించామని, కానీ మంటలు క్షణాల్లో వ్యాపించడంతో భయంతో బయటకు పరుగులు తీశామని విద్యార్థులు తెలిపారు. వెనుక ద్వారం ద్వారా బయటకు రావడంతో ప్రాణాలతో బయటపడ్డామని, ఇది తమకు పునర్జన్మ అని వారు పేర్కొన్నారు. అగ్నిప్రమాదం కారణంగా అపార్ట్‌మెంట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. విద్యార్థులు నిలువ నీడలేకుండా నిరాశ్రయులయ్యారు. స్థానిక తెలుగు సంఘాలు, విశ్వవిద్యాలయ అధికారులు విద్యార్థులకు సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి షాక్.. మాజీ మంత్రి తమ్ముడు అరెస్ట్! మరో రెండు కేసులు కూడా.. పోలీస్టేషన్‌లోనే దాడి!
మహిళల ఖాతాల్లో నెలకు ₹2,500 ! అది చేస్తేనే డబ్బు వస్తుందట! నిజమేనా ఇది?
కీలక దశకు పాస్టర్ ప్రవీణ్ మృతి.. మాజీ ఎంపీపై కేసు నమోదు! వైసీపీ గుండెల్లో గుబులు..
సెల్ఫీ వీడియోతో కలకలం! ఎస్ఐ వేధింపులతో ఆత్మహత్యాయత్నం!
ఆ రూట్ ని మోడరన్ రహదారిగా.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! నాలుగు లైన్ల రహదారి రూపంలో..!
ఏపీలో మెడిసిన్ మేకింగ్ హబ్.. భారీ పెట్టుబడులతో మెగా ప్రాజెక్ట్! 7,500 మందికి ఉపాధి కల్పన!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: