కడప జిల్లా పోట్లదుర్తిలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది. ప్రొద్దుటూరు మండలం చెన్నంరాజుపల్లెకు చెందిన రవీంద్ర అనే వ్యక్తి విషద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని తక్షణమే ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రవీంద్ర తీసుకున్న సెల్ఫీ వీడియోలో, ఆళ్లగడ్డ రూరల్ ఎస్‌ఐ ప్రసాద్ తనను వేధిస్తున్నాడని, ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకుని రూ.20 వేలు డిమాండ్ చేశారని ఆరోపించారు. ఇప్పటికే రూ.10 వేలు ఇచ్చినా కనికరం చూపక, మిగిలిన డబ్బు ఇవ్వాలంటూ మానసికంగా వేధించాడని రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సెల్ఫీ వీడియోలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తన బాధ తెలియజేస్తూ, న్యాయం చేయాలని కోరారు. పోలీసులు ప్రజల రక్షణకే ఉండాల్సిన సందర్భంలో, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇలా వ్యవహరించడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ ఆత్మహత్యాయత్నం ఘటనపై ఎర్రగుంట్ల పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటన పోలీసు వ్యవస్థపై పలు ప్రశ్నలు రేపుతున్నది.
ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్! పార్టీని విడిచిపోతున్న కీలక నేత!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో మెడిసిన్ మేకింగ్ హబ్.. భారీ పెట్టుబడులతో మెగా ప్రాజెక్ట్! 7,500 మందికి ఉపాధి కల్పన!
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..
వైసీపీ ఎంపీ అరెస్ట్.. ప్యాలెస్ షేక్! లిక్కర్ స్కాంలో హైకోర్టు కీలక నిర్ణయం..!
రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..
రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..
ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..
తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!
సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.? ఈ కేసులో కీలక పరిణామం..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: