కడప నగరంలో మాజీమంత్రి, వైసీపీ నేత అంజాద్ భాష(Amjad language) తమ్ముడు అహ్మద్ భాష సృష్టించిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని అహ్మద్ భాష ఎన్నో అక్రమాలు, అరాచకాలకు తెగబడ్డాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే అంజాద్ భాష, అతని తమ్ముడు అహ్మద్ భాషపై దృష్టి సారించింది. ఇవాళ(Sunday) అహ్మద్ భాషను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలో కడప పోలీసు బృందం అహ్మద్ భాషను అదుపులోకి తీసుకున్నారు. కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి(Madhavi Reddy), టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి దంపతులను, సీఎం చంద్రబాబు(Chandrababu)ను అసభ్యకరంగా అహ్మద్ భాష మాట్లాడాడు. గతంలో టీడీపీ నేత శ్రీనివాసుల రెడ్డిపై అహ్మద్ భాష పోలీస్టేషన్‌లోనే దాడి చేసేందుకు యత్నించాడు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి ఫిర్యాదు మేరకు అహ్మద్ భాషపై పోలీసులు కేసు నమోదు చేశారు. అహ్మద్ భాషపై మరో రెండు కేసులు కూడా నమోదైనట్లు సమాచారం. జగన్ ప్రభుత్వంలో అన్న మంత్రి అంజాద్ భాష అండచూసుకుని అహ్మద్ భాష కడపలో అరాచకాలు సృష్టించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అజ్ఞాతంలో అహ్మద్ భాష ఉన్నాడు.
ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మహిళల ఖాతాల్లో నెలకు ₹2,500 ! అది చేస్తేనే డబ్బు వస్తుందట! నిజమేనా ఇది?
కీలక దశకు పాస్టర్ ప్రవీణ్ మృతి.. మాజీ ఎంపీపై కేసు నమోదు! వైసీపీ గుండెల్లో గుబులు..
సెల్ఫీ వీడియోతో కలకలం! ఎస్ఐ వేధింపులతో ఆత్మహత్యాయత్నం!
ఆ రూట్ ని మోడరన్ రహదారిగా.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! నాలుగు లైన్ల రహదారి రూపంలో..!
ఏపీలో మెడిసిన్ మేకింగ్ హబ్.. భారీ పెట్టుబడులతో మెగా ప్రాజెక్ట్! 7,500 మందికి ఉపాధి కల్పన!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: