తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కలెక్షన్ కింగ్ డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు మళ్లీ సిల్వర్ స్క్రీన్‌కి శక్తివంతమైన రీఎంట్రీ ఇస్తున్నారు. ఆయనను ఇప్పటివరకు చూడని విధంగా చూపించబోతున్న సినిమా ‘ది ప్యారడైజ్’.
ఈ రోజు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూసినవారంతా షాక్ అవుతున్నారు. విలన్ పాత్రలో ‘శికంజా మాలిక్’గా మోహన్ బాబు మాస్ అవతారంలో దర్శనమిచ్చారు. షర్ట్ లేకుండా రక్తంతో తడిసిన పిడికిలిని పట్టుకుని, సిగరెట్ వెలిగిస్తూ, కళ్లకు నల్ల కళ్లద్దాలు ధరించి ఉన్న ఈ పోస్టర్ ఆయన పవర్‌ని ఒక్కసారిగా గుర్తు చేసింది.
సినిమా నేపథ్యం సికింద్రాబాద్‌లోని ఒక పేద బస్తీ. అక్కడ అణగారిన వర్గం చేసే పోరాటం, సిస్టమ్‌కి వ్యతిరేకంగా తిరగబడే శక్తివంతమైన కథతో ప్రేక్షకుల మనసులు కదిలించేలా రూపొందిస్తున్నారు. ఇందులో నాని-మోహన్ బాబు ఫైట్లు చూడటం అంటే థియేటర్స్‌లో సీటు ఎడ్జ్ మీద కూర్చునే అనుభూతి ఖాయం అనిపిస్తుంది.మోహన్ బాబు ఈ పాత్ర కోసం ‘ఓకే’ చెప్పారంటే ఆ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఆయన డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాలో మాస్ క్లైమాక్స్‌లా నిలవనుంది.
ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గతంలో దసరాతో నాని కెరీర్‌లోనే భారీ హిట్ ఇచ్చారు. ఈ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందుకోనున్నారు ఈ జోడి. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్, నిర్మాత సుధాకర్ చెరుకూరి, ఎస్‌ఎల్‌వి సినిమాస్ (Sri Lakshmi Venkateswara Cinemas) బ్యానర్‌పై తెరకెక్కుతోంది. హీరో నానికి జోడీగా ఈ చిత్రంలో సోనాలి కుల్కర్ణి హీరోయిన్‌గా నటిస్తోంది.
తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ ఈ చిత్రాన్ని విడుదల చేసి అంతర్జాతీయ స్థాయిలోనూ మార్క్ వేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.