LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Education

Jammulapalem ZPP High School: జమ్ములపాలెంలో డిజిటల్ విద్యకు శ్రీకారం.. కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం..!!

Jammulapalem ZPP High School: బాపట్ల జిల్లా జమ్ములపాలెం ZPP హైస్కూల్‌లో P4 ప్రోగ్రామ్ కింద ఎన్ఆర్ఐల సహకారంతో సుమారు ₹20 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్‌ను ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఏపీ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి శ్రీ కోమటి జయరాం, ఎమ్మెల్…

AndhraPravasi News Desk 2 min read
Jammulapalem ZPP High School: జమ్ములపాలెంలో డిజిటల్ విద్యకు శ్రీకారం.. కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ,  అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం..!!

Jammulapalem ZPP High School: బాపట్ల మండలం చెరువు జమ్ములపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేడు అత్యాధునిక హంగులతో డిజిటల్ విద్యకు చిరునామాగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి P4 (Public-Private-People Partnership) ఆశయాలకు అనుగుణంగా, గ్రామానికి చెందిన శ్రీ కమ్మ పుల్లయ్య చౌదరి గారి కుటుంబ సభ్యుల ఉదారతతో ఏర్పాటు చేసిన నూతన కంప్యూటర్ ల్యాబ్‌ను మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బాపట్ల ఎంపీ శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే శ్రీ మోగిలి నరేంద్ర వర్మ రాజు,  ఏపీ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి శ్రీ కోమటి జయరాం ముఖ్య అతిథులుగా హాజరై,  ల్యాబ్‌ను ప్రారంభించారు.

దైవ దర్శనం  ఘన స్వాగతం

కార్యక్రమానికి ముందుగా ముఖ్య అతిథులు గ్రామంలోని శ్రీరాముల వారి దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్న అతిథులు పాఠశాల ఆవరణకు చేరుకున్నారు. అక్కడ గ్రామస్తులు  విద్యార్థులు వారికి ఘనంగా స్వాగతం పలికారు.

అత్యాధునిక వసతులతో కంప్యూటర్ ల్యాబ్

సుమారు ₹20 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ ల్యాబ్‌లో హెచ్‌పి (HP) సంస్థకు చెందిన 25 హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. నిరంతర విద్యుత్ సరఫరా, వేగవంతమైన ఇంటర్నెట్,  ఆధునిక సీటింగ్ వసతులతో ఈ ల్యాబ్‌ను తీర్చిదిద్దారు. విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చేందుకు ఒక ఏడాది పాటు ఇన్‌స్ట్రక్టర్  ఇతర నిర్వహణ ఖర్చులను దాతలే భరిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ సంస్థలకు దీటుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, డిజిటల్ విద్యతోనే పేద విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు.

దాతల సేవా దృక్పథం - స్ఫూర్తిదాయకం

తమ సొంత గ్రామంపై మమకారంతో ఎన్ఆర్ఐలు శ్రీ కమ్మ విద్యా సాగర్, శ్రీమతి కమ్మ కీర్తి, శ్రీ కమ్మ సుధాకర్  శ్రీమతి కమ్మ దివ్య గారు ఈ ల్యాబ్ ఏర్పాటుకు ముందుకు రావడం పట్ల అతిథులు హర్షం వ్యక్తం చేశారు. గతంలోనూ వీరు పాఠశాల విద్యార్థుల కోసం 60 సైకిళ్లు పంపిణీ చేయడమే కాకుండా, గ్రామంలోని మంచినీటి ప్లాంట్‌ను ఆధునీకరించి ప్రజల ఆరోగ్యానికి తోడ్పడ్డారని కొనియాడారు. విదేశాల్లో ఉన్నా తమ మూలాలను మర్చిపోకుండా ఇలాంటి సేవలు చేయడం ఎంతో స్ఫూర్తిదాయకమని కోమటి జయరాం పేర్కొన్నారు.

క్రీడలు  ఇతర అభివృద్ధి పనులు

జమ్ములపాలెం పాఠశాల విద్యార్థులు హాకీలో జాతీయ స్థాయిలో రాణిస్తుండటాన్ని ఎంపీ కృష్ణ ప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు. వారి ప్రతిభను మరింత మెరుగుపరిచేందుకు పాఠశాలలో త్వరలోనే ఒక సైన్స్ ల్యాబ్  ప్రత్యేక హాకీ గ్రౌండ్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సరైన మైదానం లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గమనించి, క్రీడల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని నేతలు హామీ ఇచ్చారు.

ఆదర్శంగా జమ్ములపాలెం స్కూల్

నెల్లూరు, అమరావతి వంటి ప్రాంతాల్లోని మోడల్ స్కూళ్ల తరహాలో జమ్ములపాలెం ZPP హైస్కూల్‌ను కూడా అత్యుత్తమ విద్యా కేంద్రంగా మార్చడమే తమ విజన్ అని ప్రతినిధులు తెలిపారు. ఈ మార్పు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు  పాఠశాలలకు ఒక గొప్ప ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ డి. శ్రీనివాస్, స్థానిక నేతలు, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు  గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Be the first to react

More Coverage

Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!

Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!

Vishaka: ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉక్కునగరంలో మూతపడిన 40 ఏళ్ల చారిత్రాత్మక "విశాఖ విమల విద్యాలయం"ను ఆంధ్…

Education: భారత్‌లోనే లివర్‌పూల్ విశ్వవిద్యాలయ డిగ్రీ.. బెంగళూరులో క్యాంపస్‌కు యూజీసీ తుది అనుమతి!

Education: భారత్‌లోనే లివర్‌పూల్ విశ్వవిద్యాలయ డిగ్రీ.. బెంగళూరులో క్యాంపస్‌కు యూజీసీ తుది అనుమతి!

Education: విదేశాలకు వెళ్లకుండానే అంతర్జాతీయ స్థాయి విద్యను అభ్యసించాలనుకునే భారత విద్యార్థులకు శుభవ…