Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!
Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా కొండవీటి వాగు, పాలవాగులపై నిర్మిస్తున్న బ్రిడ్జిల నిర్మాణ పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు.
రాజధానిలో వరద నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు.. బ్రిడ్జిల నిర్మాణం ముమ్మరం..
అమరావతి నిర్మాణాలపై మంత్రి నారాయణ క్లారిటీ.. భవనాల ఖర్చుపై వాస్తవాలు వెల్లడి..
అమరావతి: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా కొండవీటి వాగు, పాలవాగులపై నిర్మిస్తున్న బ్రిడ్జిల నిర్మాణ పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు.
రాజధాని ప్రాంతంలో వర్షాకాలంలో నీటి ప్రవాహానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ తెలిపారు. కొండవీటి వాగు, పాలవాగు పనులు వేగంగా జరుగుతున్నాయని, రెండు వాగులపై మొత్తం 69 బ్రిడ్జిల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.
వర్షపు నీరు నిలిచిపోకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. వర్షాకాలంలో ఎక్కడా నీరు నిలిచే పరిస్థితి రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. రాజధాని భవనాల నిర్మాణ వ్యయంపై వస్తున్న విమర్శలను ఆయన ఖండించారు.
కేంద్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి చదరపు అడుగుకు సుమారు రూ.3,945 ఖర్చు అవుతుందని, అమరావతి హ్యాపీనెస్ట్ నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.3,393 మాత్రమేనని వివరించారు. గెజిటెడ్ అధికారుల నివాసాల నిర్మాణ వ్యయం కూడా చదరపు అడుగుకు రూ.3,684 మాత్రమేనని తెలిపారు.
అమరావతిలో నిర్మిస్తున్న అనేక భవనాలు ప్రత్యేక డిజైన్లతో కూడిన ఐకానిక్ నిర్మాణాలు కావడం వల్ల కొంత వ్యయం ఎక్కువగా ఉంటుందని మంత్రి చెప్పారు. పార్లమెంట్ భవనం, తెలంగాణ సచివాలయం వంటి నిర్మాణాల్లో కూడా తొలుత అంచనా వేసిన ఖర్చులతో పోలిస్తే పూర్తయ్యే సమయానికి వ్యయం పెరిగిందని గుర్తు చేశారు.
భవనాల నిర్మాణంపై అవాస్తవ ప్రచారం చేయడం సరికాదని మంత్రి నారాయణ అన్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఇలాగే తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంటే ప్రజల మద్దతు మరింత తగ్గిపోతుందని వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతిని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
Tags
Be the first to react