Air Canada: ప్రయాణికులకు అలర్ట్! ఆ విమానాలు రద్దు! ముందుగా చెక్ చేసుకోకుంటే తిప్పలు తప్పవు!

స్విట్జర్లాండ్ గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ యూరోపియన్ యూనియన్ వెలుపల ఉన్న దేశాల పౌరులకు పెద్ద అవకాశాన్ని అందిస్తోంది. ఈ పథకం కింద, ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా అక్కడ నివాస హక్కు పొందవచ్చు. ఇది కేవలం వలస విధానం మాత్రమే కాకుండా, స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ఉద్యోగాలను సృష్టించడం, సాంస్కృతిక వైవిధ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.

Samantha : అందుకే సినిమాలు తగ్గించాను.. సమంత!

ఈ వీసా కలిగినవారికి స్విట్జర్లాండ్‌లో నివసించే, వ్యాపారం చేసే, పని చేసే హక్కులు ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత స్థిరమైన ఆర్థిక వ్యవస్థలో భాగం కావడంతో పాటు, మంచి జీవన ప్రమాణాలు, అత్యాధునిక ఆరోగ్య సదుపాయాలు, విద్య మరియు మౌలిక వసతులు లభిస్తాయి. అంతేకాకుండా, షెంగెన్ ప్రాంతంలోని దేశాలకు ఎలాంటి వీసా లేకుండా సులభంగా ప్రయాణించవచ్చు. రాజకీయ స్థిరత్వం, తక్కువ నేర రేటు, పన్ను సడలింపులు వంటి అంశాలు కూడా దీనిని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి. కుటుంబ సభ్యులు, భార్య లేదా భర్తతో పాటు 18 ఏళ్ల లోపు పిల్లలు కూడా ఈ వీసా కింద రావచ్చు.

Jio Best Plans: జియో అదిరిపోయే ఆఫర్.. హాట్‌స్టార్ ఫ్రీ, అన్‌లిమిటెడ్ కాల్స్.. ఈ బడ్జెట్ ప్లాన్‌తో పండుగే!

అయితే ఈ వీసా పొందడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. దరఖాస్తుదారులు EU వెలుపల దేశ పౌరులు కావాలి, వయసు 18 నుంచి 55 మధ్య ఉండాలి. క్రిమినల్ రికార్డ్ లేకపోవాలి, ఆరోగ్యంగా ఉండాలి మరియు చట్టబద్ధమైన స్థిరమైన ఆదాయానికి రుజువులు చూపించాలి. అదనంగా, స్విట్జర్లాండ్‌లో ఒక ఇల్లు లేదా ఆస్తి ఉండాలి.

New Phone: రూ.13,999కే సూపర్ ఫోన్.. 50MP కెమెరా, 6.9 అంగుళాల డిస్‌ప్లేతో పోకో M7 ప్లస్ 5G! ఇవాళ్టి నుంచే సేల్‌!

పెట్టుబడికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి లంప్ సమ్ ట్యాక్స్ అగ్రిమెంట్, దీంట్లో దరఖాస్తుదారులు సంవత్సరానికి కనీసం CHF 200,000 నుండి CHF 600,000 వరకు పన్ను చెల్లించాలి, అయితే ఉద్యోగం చేసుకోవడానికి అనుమతి ఉండదు. మరొకటి ఎంట్రప్రెన్యూర్ ఇన్వెస్టర్ స్కీమ్, ఇందులో కనీసం CHF 1 మిలియన్ పెట్టుబడి పెట్టి కొత్త కంపెనీ స్థాపించాలి లేదా ఉన్న వ్యాపారానికి నిధులు సమకూర్చాలి. ఇందులో ఉద్యోగాలు సృష్టించడం తప్పనిసరి.

Saturn Amavasya: 23న శని అమావాస్య ఈ ఒక్క పని చేస్తే చాలు.. జీవితంలో ఊహించని మార్పులు, అదృష్టం మీ వెంటే!

దరఖాస్తు ప్రక్రియకు సాధారణంగా ఐదు నెలల వరకు సమయం పడుతుంది. మొదట పెట్టుబడి మార్గాన్ని ఎంచుకోవాలి, తర్వాత స్విస్ అధికారుల అనుమతి పొందాలి. అనంతరం D వీసాకు దరఖాస్తు చేసి, స్విట్జర్లాండ్‌కి వెళ్ళి నివాస అనుమతిగా మార్చుకోవాలి. ఈ తాత్కాలిక నివాసాన్ని పునరుద్ధరించుకుంటూ వెళ్తే 10 ఏళ్ల తర్వాత శాశ్వత నివాస హక్కు లభిస్తుంది. కనీసం 12 సంవత్సరాల తర్వాత పౌరసత్వం పొందే అవకాశం ఉంటుంది. గోల్డెన్ వీసా వెంటనే పౌరసత్వం ఇవ్వకపోయినా, దీర్ఘకాలంలో భద్రత, ఆర్థికాభివృద్ధి, ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణ స్వేచ్ఛ వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

Amararaja Giga Factory: ఒక పరిశ్రమ.. వేలాది ఉద్యోగాలు.. 16 గిగావాట్ల సామర్థ్యం! గిగా ఫ్యాక్టరీపై మరో రూ.1200 కోట్ల పెట్టుబడి!
Police: తెలంగాణ పోలీస్ నియామకాల్లో షాక్:! 59 మంది నకిలీ సర్టిఫికెట్లతో..!
108 Coin: మీరు ఎప్పుడైనా 108 కాయిన్ చూశారా! దేశంలో ఇదే తొలిసారిగా..!
Online betting: కొత్త బిల్లు.. ఇక ఆన్లైన్ బెట్టింగ్‌కు చెక్!
Trump: ట్రంప్ కుటుంబం–పాక్ క్రిప్టో డీల్! మనీలాండరింగ్, ఉగ్ర నిధులపై సంచలన ఆరోపణలు!
Free Mobile: ఏపీలో వారందరికీ ఉచితంగా మొబైల్! వెంటనే దరఖాస్తు చేసుకోండి! 26 వరకే ఛాన్స్!
Teachers transfer: టీచర్ల బదిలీలకు నేటి నుంచి దరఖాస్తులు.. AP విద్యాశాఖ ప్రకటన!
Infosys: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు 80% బోనస్.. సోషల్ మీడియాలో చర్చ!
Bullet Train: హైదరాబాదు నుండి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్! గంటకు 350 కిలో మీటర్ల వేగం... ఏపీలో ఆ మూడు నగరాల మీదుగా!
Workers: ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్! పెండింగ్ బిల్లుల విడుదలకు గ్రీన్ సిగ్నల్!