టాలీవుడ్‌లో హీరో రామ్ చరణ్ – ఉపాసన దంపతులు అందమైన జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుని దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది. మొదట్లో ఉపాసనను కొందరు విమర్శించినా… కాలక్రమేణా ఆమె అందం, వ్యక్తిత్వం చూసి అందరూ మెచ్చుకున్నారు. ఇప్పుడు ఉపాసనకు ప్రత్యేకమైన అభిమాన వర్గం కూడా ఏర్పడింది.
ఇక గత సంవత్సరం మెగా అభిమానులకు ఆనందకరమైన వార్త వచ్చింది. పెళ్లయి 11 ఏళ్ల తర్వాత ఉపాసన తల్లిగా మారింది. ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి క్లీన్ క్లారా అనే పేరు పెట్టారు. ఈ బిడ్డ రాకతో మెగా కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. అయితే ఇప్పటివరకు క్లీన్ క్లారాను బయట ప్రపంచానికి చూపించలేదు. అయినప్పటికీ, ఆ చిన్నారిపై అందరికీ ఆసక్తి ఎక్కువగానే ఉంది.
ఉపాసన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మొదటి బిడ్డ విషయంలో నేను చాలా విషయాలను బయటపెట్టలేదు. అందువల్ల కొంత విమర్శలు కూడా ఎదుర్కొన్నాను. కానీ రెండో బిడ్డ విషయం రహస్యంగా ఉంచను. అవసరమైతే ఓపెన్‌గా చెబుతాను అని పేర్కొంది. ఇదే సమయంలో రెండో బిడ్డకు కూడా సిద్ధమే అని ఉపాసన చెప్పడం ప్రత్యేకంగా మారింది.
ఇదిలా ఉండగా… తాజాగా ఉపాసన రెండోసారి గర్భవతి అయ్యారని టాక్ వినిపిస్తోంది. ఢిల్లీలో జరిగిన ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రామ్ చరణ్ – ఉపాసన దంపతులు కలిసి హాజరయ్యారు. ఆ వేడుకలో ఉపాసన మెట్లు దిగుతూ చాలా నెమ్మదిగా నడుస్తూ కనిపించారు. రామ్ చరణ్ కూడా ఆమెకు సపోర్ట్ చేస్తూ చేతిని పట్టుకుని మెల్లగా కిందకు దింపడం అక్కడ ఉన్నవారికి గమనించబడింది.
అలాగే, ఉపాసన తన డ్రెస్‌తో పొట్ట కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపించడం మరింత అనుమానాలు పెంచింది. దీంతో ఉపాసన రెండోసారి గర్భవతి అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మెగా అభిమానులు ఈ వార్త విన్న వెంటనే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపై ఈ వార్తపై మెగా కుటుంబం ఎలా స్పందిస్తుందో అందరి దృష్టి అక్కడికే మళ్లింది. నిజంగానే ఉపాసన రెండోసారి గర్భవతి అయితే… అది మెగా అభిమానులకు మరో పెద్ద శుభవార్తే అవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో మెగా వారసుడు రామ్ చరణ్ – ఉపాసన దంపతుల వ్యక్తిగత జీవితం గురించి జరుగుతున్న ఈ చర్చ హాట్ టాపిక్‌గా మారింది.