స్పేస్ ,టెస్లా ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల భారతీయుల మధ్య చర్చకు దారితీసే ట్వీట్ చేశారు. బ్రిటీష్ వలస పాలనపై ఆయన చేసిన వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అయ్యాయి. చాలా మంది భారతీయులు మస్క్ రీట్వీట్ చేసిన పోస్టును తప్పుగా భావిస్తూ, సోషల్ మీడియాలో కఠినంగా స్పందించారు.
మస్క్ (X) రీట్వీట్ చేసిన ట్వీట్‌లో బ్రిటన్‌లో ఉంటున్న భారతీయులు బ్రిటీషర్లు అయితే, భారత్‌కి వెళ్ళిన బ్రిటీషర్లు భారతీయులే అవుతారు. కాబట్టి వలస పాలన నిజంగా ఏమీ లేదు అని పేర్కొన్నారు. దీనికి మస్క్ ఒక స్మైల్ ఎమోజీతో అంగీకరించినట్టు చూపించారు. అయితే, ఈ వాదనను పెద్ద సంఖ్యలో భారతీయులు అసహ్యంగా భావించారు.
భారతీయులు ఈ ట్వీట్‌పై స్పందిస్తూ భారతీయులు ఇంగ్లాండ్ వనరులను ధ్వంసం చేయడం లేదా అక్కడి పౌరులను వేధించడం జరగలేదు. బెంగాల్ విపత్తులకు, జలియన్‌వాలాబాగ్ వంటి ఘోర ఘటనలకు కారణం కాలేదు. అదనపు పన్నులు విధించడం, బ్రిటన్ వ్యాపారాలను నష్టపరచడం, ప్రజలను దూరప్రాంతాల జైళ్లలో చేర్చడం జరిగింది కాదు అని కౌంటర్ వ్యాఖ్యలు చేశారు.
ఇంకో వ్యక్తి తెల్లజాతీయులు వలస పాలనను సమర్థించడానికి ఎప్పటినుండి ఈ రకమైన వాదనలు వినియోగిస్తున్నారు. సైనిక దాడులు సంపద దోపిడి, అత్యాచారాలు, పాలకుల అణచివేతలను చట్టబద్ధమైన వలసలతో పోల్చడం సరిగ్గా కాదు. ఇది తమ తప్పులేదు అని చెప్పి మైనారిటీలను తక్కువ చూపించడానికి చేసే ప్రయత్నం మాత్రమే అని అన్నారు.
ప్రస్తుతానికి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. చాలా మంది వ్యాఖ్యలు, రిప్లైలు, చర్చలు చేస్తున్నారు. వలస పాలనపై చారిత్రక అవగాహన లేకుండా చేసిన వాదనలు ఎంత ప్రభావితం చేస్తాయో ఈ ఉదంతం చూపిస్తోంది.