చాలామంది తల్లిదండ్రులు పిల్లల కోసం నేచురల్ ఉత్పత్తులు వాడాలని అనుకుంటారు. మార్కెట్లో దొరికే పాలపొడులు సౌకర్యంగా ఉన్నా, వాటిలో ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఎక్కువగా కలుపుతారు. ఇవి పిల్లల ఆరోగ్యానికి హానికరం కావచ్చు. అందుకే, ఇంట్లోనే స్వచ్ఛమైన పదార్థాలతో పాలపొడిని తయారు చేసుకోవడం ఉత్తమం. ఇది ఆరోగ్యానికి మంచిదే కాకుండా, సురక్షితంగా కూడా ఉంటుంది.
పాలపొడి వాడకం కేవలం పిల్లల ఆహారానికే కాకుండా, మరెన్నో ఉపయోగాలు కలిగిస్తుంది. ఇందులో ఉన్న ప్రోటీన్, క్యాల్షియం ఎముకల బలానికి, ఆరోగ్యానికి తోడ్పడతాయి. అలాగే చర్మానికి అప్లై చేస్తే మృత కణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. పెరుగు చిక్కబడటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. నీటిలో సులభంగా కరిగిపోవడం వల్ల పాలు అవసరమైనప్పుడు వెంటనే తయారు చేసుకోవచ్చు.
ఇంట్లో పాలపొడి తయారీకి ఎక్కువ పదార్థాలు అవసరం లేదు. ఫుల్ క్రీమ్ పాలు, కొద్దిగా చక్కెర ఉంటే సరిపోతుంది. ముందుగా ఒక లీటర్ పాలను మరిగించి, ఎక్కువసేపు మరిగనివ్వాలి. పాలు చిక్కబడి క్రీమ్‌లా మారిన తర్వాత దాన్ని ఆరబెట్టి పొడిగా మార్చాలి. ఈ దశలో ఉన్న తేమ పూర్తిగా పోయేలా చూడాలి.
మరుసటి దశలో ఈ పొడిబడ్డ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అవసరమైతే చక్కెర కూడా జోడించి మళ్ళీ మిక్సీ పట్టాలి. గ్రైండ్ చేసిన తర్వాత పౌడర్‌ను వడకట్టడం మంచిది. ఇలా చేస్తే పొడి మరింత మెత్తగా తయారవుతుంది. ఈ పౌడర్‌ను ఎయిర్‌టైట్ డబ్బాలో పెట్టి నిల్వ ఉంచవచ్చు.
మార్కెట్లో దొరికే పాలపొడికి, ఇంట్లో చేసిన పాలపొడికి మధ్య ప్రధాన తేడా రంగులో ఉంటుంది. బయట దొరికేది తెల్లగా ఉండగా, ఇంట్లో చేసినది కొంచెం పసుపు రంగులో ఉంటుంది. కానీ ఇంట్లో చేసిన పాలపొడి పూర్తిగా నేచురల్‌గా, కెమికల్స్ లేకుండా ఉంటుంది. అందువల్ల పిల్లలకు నిస్సంకోచంగా ఇవ్వవచ్చు.